బీహార్లో కిడ్నాప్ లు ఎక్కువ పోలీసుల మధ్య బీహార్ లో షూటింగ్ చేశాము:కోన

by సూర్య | Tue, Mar 31, 2020, 10:59 AM

తాజాగా 'ఆలీతో సరదాగా' కార్యక్రమంలో రచయిత కోన వెంకట్ మాట్లాడుతూ, రామ్ గోపాల్ వర్మ గురించి ప్రస్తావించారు. 'ముంబైలో వర్మ దగ్గర చేరాను .. ఆయన నిర్మించిన 'శూల్' సినిమాకి ఎగ్జిక్యుటివ్ ప్రొడ్యూసర్ గా పనిచేశాను. కథ ప్రకారం ఆ సినిమా షూటింగు బీహార్లో చేయాలి. కానీ బీహార్లో కిడ్నాప్ లు ఎక్కువగా జరుగుతాయి. కిడ్నాప్ లు చేసి డబ్బు డిమాండ్ చేయడం అక్కడ ఎక్కువ.

అందువలన అందరిలో టెన్షన్ మొదలైంది. బీహార్లో 'మోతిహారి' అనే జిల్లా వుంది .. అక్కడి ఎస్పీ శర్మ రాజన్ నాకు బాగా పరిచయం .. ఆయన తమిళియన్. ఆయనకి కాల్ చేసి విషయం చెబితే, ఆ జిల్లాలో షూటింగ్ చేసుకోమని చెప్పాడు. సెక్యూరిటీగా 150 మంది పోలీసులను ఇచ్చాడు. షూటింగు జరిగినన్ని రోజులు 'స్టెన్ గన్స్' తో వాళ్లు మాకు సెక్యూరిటీని ఇస్తూ వచ్చారు. ఈ సినిమాతోనే సాయాజీ షిండే వెండితెరకి పరిచయమయ్యాడు" అని చెప్పుకొచ్చారు.

Latest News
 
'హరోమ్ హర' సెకండ్ సింగల్ అవుట్ Wed, Apr 24, 2024, 04:14 PM
'కేజీఎఫ్ 1' రీ రిలీజ్ విడుదలకి తేదీ లాక్ Wed, Apr 24, 2024, 04:13 PM
'మిరాయ్' సెట్స్‌ లో మంచు మనోజ్ Wed, Apr 24, 2024, 04:10 PM
నటుడు దీపక్ పరంబోల్‌ను వివాహం చేసుకున్న నటి అపర్ణా దాస్ Wed, Apr 24, 2024, 04:06 PM
'మంజుమ్మెల్ బాయ్స్' OTT ఎంట్రీపై లేటెస్ట్ బజ్ Wed, Apr 24, 2024, 04:04 PM