ఆ సినిమాలో అనసూయ రోల్ అదేనా ?

by సూర్య | Tue, Mar 31, 2020, 08:57 AM

యాంకర్ అనసూయ బుల్లితెర నుండి వెండితెర మీదికి ఎంట్రీ ఇచ్చి ‘రంగస్థలం’ సినిమాతో నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ సినిమా తర్వాత ఆమెకు చాలానే ఆఫర్లు వచ్చినా ఆచితూచి పాత్రల్ని ఎంచుకుంటోంది. కథలో ప్రాధాన్యం కలిగిన పాత్రల్ని మాత్రమే చూజ్ చేసుకుంటూ వస్తోన్న అనసూయకు కృష్ణవంశీ ‘రంగమార్తాండ’ సినిమాలో ఆఫర్ వచ్చిన సంగతి తెలిసిందే. కాగా ఈ సినిమాలో అనసూయ పాత్ర విషయానికి వస్తే.. నాటకాలు వేసే ఓ రంగస్థలం నటిగా నటించనుందట. అలాగే సినిమాలో సీన్స్ కి అనుగుణంగా ఓ ప్రత్యేక సాంగ్ లో కూడా అనసూయ నటించాల్సి ఉంటుందట. కాగా ఒరిజినల్ వెర్షన్ లో నానా పటేకర్ పోషించిన పాత్రను ఈ చిత్రంలో ప్రకాష్ రాజ్ చేస్తుండగా.. ఇక ప్రకాష్ రాజ్ సరసన రమ్యకృష్ణ నటిస్తోంది. కృష్ణవంశీ దాదాపు 20 సంవత్సరాల తరువాత తన సతీమణిని డైరెక్ట్ చేయబోతున్నాడు. ఈ సినిమాని అభిషేక్ అండ్ మధు నిర్మిస్తున్నారు. అయితే గత కొన్ని సంవత్సరాలుగా ‘కృష్ణ వంశీ’ సినిమాలు మాత్రం బాక్సాఫీస్ వద్ద పెద్దగా విజయం సాధించలేకపోతున్నాయి. మరి ఈ సినిమాతోనైనా మళ్ళీ కృష్ణవంశీ ఫామ్ లోకి వస్తారేమో చూడాలి.

Latest News
 
'విదా ముయార్చి' ఫస్ట్ లుక్ ఈ తేదీన విడుదల కానుందా? Fri, Apr 19, 2024, 06:07 PM
బెల్లంకొండ శ్రీనివాస్ తదుపరి చిత్రానికి క్రేజీ టైటిల్ Fri, Apr 19, 2024, 06:05 PM
వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ తేదీని లాక్ చేసిన 'RRR' Fri, Apr 19, 2024, 06:04 PM
'ప్రతినిధి 2' ఓవర్సీస్ రైట్స్ ని సొంతం చేసుకున్న ప్రముఖ బ్యానర్ Fri, Apr 19, 2024, 06:02 PM
'అరణ్మనై 4' UK అండ్ యూరప్ రైట్స్ ని సొంతం చేసుకున్న ప్రముఖ బ్యానర్ Fri, Apr 19, 2024, 06:00 PM