పూజ హెగ్డేకు వరుస ఆఫర్లు

by సూర్య | Mon, Mar 30, 2020, 02:40 PM

పూజ హెగ్డేకు అదృష్టం పట్టుకుంది. వరుస సినిమాల విజయాలతో ప్రస్తుతం టాప్ ప్లేస్ లో దూసుకుపోతుంది. ఈ సంక్రాంతికి 'అల వైకుంఠపురములో' సినిమా బిగ్గెస్ట్ హిట్ అందుకుంది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ ప్రభాస్ సరసన పీరియాడిక్ లవ్ స్టోరీ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుండగా..అఖిల్ సరసన 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్' సినిమాలో కూడా హీరోయిన్ గా నటిస్తుంది.టాలీవుడ్ లో హిట్స్ తో దూసుకుపోతున్న పూజ హెగ్డే బాలీవుడ్ లో కండల వీరుడు సల్మాన్ ఖాన్ సరసన నటించే ఛాన్స్ కొట్టేసింది. అంతేకాక ప్రస్తుతం త్రివిక్రమ్ - ఎన్టీఆర్ సినిమాలో కూడా హీరోయిన్ గా పూజని తీసుకుంటున్నారనే వార్తలు వస్తున్నాయి. తాజా సమాచారం మేరకు పూజ మరో గోల్డెన్ ఛాన్స్ కొట్టేసిందట. డైరెక్టర్ హరి తెరకెక్కిస్తున్న 'అరువా' చిత్రంలో సూర్య కి జంటగా పూజ హెగ్డే ని తీసుకొనే ఆలోచనలో ఉన్నారట. దాదాపు పూజ ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిచడం ఖాయం అని తెలుస్తుంది.

Latest News
 
వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ తేదీ ఖరారు చేసిన 'చంద్రముఖి 2' Thu, Apr 25, 2024, 09:26 PM
సాలిడ్ టిఆర్పీని నమోదు చేసిన 'లియో' Thu, Apr 25, 2024, 09:23 PM
అనుపమ తదుపరి టైటిల్ మరియు కాన్సెప్ట్ వీడియోని లాంచ్ చేయనున్న సమంత, రాజ్ అండ్ DK Thu, Apr 25, 2024, 09:19 PM
'ఫ్యామిలీ స్టార్' నుండి దేఖో రే దేఖో వీడియో సాంగ్ అవుట్ Thu, Apr 25, 2024, 09:17 PM
షాకింగ్ టిఆర్పిని నమోద చేసిన 'ఆదికేశవ' Thu, Apr 25, 2024, 09:13 PM