'మోసగాళ్లు' సినిమా అప్ డేట్ జూన్ 5వ తేదీన విడుదల

by సూర్య | Mon, Mar 30, 2020, 12:43 PM

మంచు విష్ణు కథానాయకుడిగా ఆయన సొంత బ్యానర్లో 'మోసగాళ్లు' సినిమా రూపొందుతోంది. జెఫ్రీ గీ చిన్ ఈ సినిమాకి దర్శకుడిగా వ్యవహరిస్తున్నాడు. విభిన్నమైన కథాకథనాలతో .. పూర్తి వినోదభరితంగా ఈ సినిమాను రూపొందిస్తున్నారు. కాజల్ కథానాయికగా నటించిన ఈ సినిమాలో, సునీల్ శెట్టి ప్రతినాయకుడిగా నటిస్తున్నాడు.నవీన్ చంద్ర .. నవదీప్ ముఖ్యమైన పాత్రలను పోషిస్తున్నారు. జూన్ 5వ తేదీన ఈ సినిమాను విడుదల చేయాలని విష్ణు భావించాడు. అయితే కరోనా కారణంగా చాలా సినిమాలు తమ విడుదల తేదీలను మార్చుకుంటూ వస్తున్న నేపథ్యంలో, ఈ సినిమా విడుదల తేదీ కూడా మారొచ్చనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఆలోగా కరోనా అదుపులోకి వస్తే మాత్రం అదే తేదీన విడుదల చేయాలనే నిర్ణయంతో విష్ణు వున్నాడని అంటున్నారు.

Latest News
 
కొత్త విడుదల తేదీని లాక్ చేసిన 'లవ్ మి - ఇఫ్ యు డేర్' Wed, Apr 24, 2024, 07:54 PM
15M+ వ్యూస్ ని సొంతం చేసుకున్న 'మిరాయి' టైటిల్ టీజర్ Wed, Apr 24, 2024, 07:52 PM
మరో రెండు రోజులలో 'టిల్లు స్క్వేర్' OTT ఎంట్రీ Wed, Apr 24, 2024, 06:21 PM
'థగ్ లైఫ్‌' సెట్స్ లో జాయిన్ అయ్యిన త్రిష Wed, Apr 24, 2024, 06:19 PM
3M+ వ్యూస్ ని సొంతం చేసుకున్న 'ఆ ఒక్కటి అడక్కు' ట్రైలర్ Wed, Apr 24, 2024, 06:17 PM