అద్భుత కళాకండానికి '14 ఏళ్ళు'

by సూర్య | Mon, Mar 30, 2020, 10:53 AM

భక్తిరస కథా చిత్రాలతోనే అద్భుత కళాకాండం అయిన 'శ్రీరామదాసు' విడుదలై నేటికీ 14 ఏళ్ళు అవుతుంది. తహసీల్దార్ గోపన్న సీతారామచంద్రస్వామి ఆలయాన్ని ఎలా నిర్మించాడు అనే కథాంశానికి ప్రతిఒక్కరు ముగ్దుడయ్యే డ్రామాని కలిపి ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు దర్శకుడు కె. రాఘవేంద్రరావు. 'రామదాసు' పాత్రలో అక్కినేని నాగార్జున అద్భుత నటనకు ప్రజలు నీరాజనం పట్టారు. ఇందులోని అంతా రామమయం ఈ జగమంతా రామమయం..తాగరా శ్రీరామ నామామృతం..శ్రీ రామ నీ నామమెంతో రుచిరా..నను బ్రోవమని చెప్పవే సీతమ్మతల్లి..దాశరథీ కరుణాపయోనిధి..లాంటి ఎన్నో పాటలు ఇప్పటికీ అన్ని ఆలయాల్లో మారుమ్రోగుతూనే ఉన్నాయి. స్నేహ, నాజర్, అక్కినేని నాగేశ్వరరావు లాంటి నటులు తమ నటనతో ఆకట్టుకోగా ఎం.ఎం కీరవాణి అందించిన సంగీతం ఈ సినిమా స్థాయిని పెంచింది. మొత్తంగా తెలుగు సినిమా చరిత్రలోనే 'శ్రీరామదాసు' ఒక కళాకాండంగా నిలిచిపోతుంది అనడంతో అతిశయోక్తి లేదు.

Latest News
 
మరో రెండు రోజులలో 'టిల్లు స్క్వేర్' OTT ఎంట్రీ Wed, Apr 24, 2024, 06:21 PM
'థగ్ లైఫ్‌' సెట్స్ లో జాయిన్ అయ్యిన త్రిష Wed, Apr 24, 2024, 06:19 PM
3M+ వ్యూస్ ని సొంతం చేసుకున్న 'ఆ ఒక్కటి అడక్కు' ట్రైలర్ Wed, Apr 24, 2024, 06:17 PM
'దేవర' ఫస్ట్ సింగల్ విడుదల ఎప్పుడంటే...! Wed, Apr 24, 2024, 06:15 PM
'NBK109' సెట్స్ లో జాయిన్ అయ్యిన బాబీ డియోల్ Wed, Apr 24, 2024, 05:46 PM