కార్మికులకు చేయూతగా యంగ్ హీరో విశ్వక్ సేన్ సాయం

by సూర్య | Sun, Mar 29, 2020, 05:02 PM

యంగ్ హీరో విశ్వక్ సేన్ కరోనా కర్ఫ్యూ నేపథ్యంలో తన వంతు సామజిక బాధ్యత నెరవేర్చాడు. కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టే పనిలో భాగంగా దేశంలో టోటల్ లాక్ డౌన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. దీని కారణంగా అన్ని పరిశ్రమలతో పాటు, చిత్ర పరిశ్రమ సైతం మూతపడింది. సినిమాల విడుదల, షూటింగ్స్ కి బంద్ ప్రకటించడంతో ఈ పరిశ్రమపై ఆధారపడిన అనేక మంది ఉపాధికోల్పోయారు. ముఖ్యంగా డైలీ వేజ్ వర్కర్స్ చాల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వీరి సహాయార్ధం హీరో విశ్వక్ సేన్ 5లక్షల ఆర్థిక సాయం ప్రకటించారు. నేడు ఆయన పుట్టిన రోజుని పురస్కరించుకొని ఆయన ఈ మంచి కార్యక్రమం తలపెట్టారు. విశ్వక్ సేన్ తాజాగా హిట్ మూవీతో ఓ మోస్తరు విజయాన్ని అందుకున్నారు. విశ్వక్ ప్రస్తుతం పాగల్ అనే కొత్త చిత్రంలో నటిస్తున్నారు.

Latest News
 
కొత్త విడుదల తేదీని లాక్ చేసిన 'లవ్ మి - ఇఫ్ యు డేర్' Wed, Apr 24, 2024, 07:54 PM
15M+ వ్యూస్ ని సొంతం చేసుకున్న 'మిరాయి' టైటిల్ టీజర్ Wed, Apr 24, 2024, 07:52 PM
మరో రెండు రోజులలో 'టిల్లు స్క్వేర్' OTT ఎంట్రీ Wed, Apr 24, 2024, 06:21 PM
'థగ్ లైఫ్‌' సెట్స్ లో జాయిన్ అయ్యిన త్రిష Wed, Apr 24, 2024, 06:19 PM
3M+ వ్యూస్ ని సొంతం చేసుకున్న 'ఆ ఒక్కటి అడక్కు' ట్రైలర్ Wed, Apr 24, 2024, 06:17 PM