టాప్ ట్రెండింగ్ లో భీమ్ ఫర్ రామరాజు

by సూర్య | Sun, Mar 29, 2020, 04:45 PM

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పుట్టిన రోజు కానుకగా రాజమౌళి ఆర్ ఆర్ ఆర్ నుండి భీమ్ ఫర్ రామరాజు పేరుతో ఓ వీడియో విడుదల చేశారు. ఆర్ ఆర్ ఆర్ లో రామరాజుగా చరణ్ లుక్ మరియు పాత్ర తీరును పరిచయం చేస్తూ విడుదలైన ఆ వీడియో యూట్యూబ్ లో దుమ్మురేపుతుంది. టాప్ ట్రెండింగ్ లో కొనసాగుతున్న ఆ వీడియో ఇప్పటికే 6 మిలియన్ వ్యూస్ దాటిపోయింది. అలాగే ఈ వీడియో లైక్స్ 3 లక్షలకు చేరువయ్యాయి. ఈ వీడియోలో ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ హైలైట్ గా నిలిచింది. రౌద్రం రణం రుధిరం పేరుతో తెరకెక్కుతున్న ఈ మూవీ ఐదు భాషలలో భారీగా పాన్ ఇండియా లెవెల్ లో విడుదల కానుంది. మొదట ఈ చిత్రాన్ని జులై 30, 2020లో విడుదల చేయాలని భావించారు. అనుకున్న సమయానికి షూటింగ్ పూర్తి కాకపోవడంతో వచ్చే ఏడాది జనవరి 8కి వాయిదా వేశారు.

Latest News
 
కొత్త విడుదల తేదీని లాక్ చేసిన 'లవ్ మి - ఇఫ్ యు డేర్' Wed, Apr 24, 2024, 07:54 PM
15M+ వ్యూస్ ని సొంతం చేసుకున్న 'మిరాయి' టైటిల్ టీజర్ Wed, Apr 24, 2024, 07:52 PM
మరో రెండు రోజులలో 'టిల్లు స్క్వేర్' OTT ఎంట్రీ Wed, Apr 24, 2024, 06:21 PM
'థగ్ లైఫ్‌' సెట్స్ లో జాయిన్ అయ్యిన త్రిష Wed, Apr 24, 2024, 06:19 PM
3M+ వ్యూస్ ని సొంతం చేసుకున్న 'ఆ ఒక్కటి అడక్కు' ట్రైలర్ Wed, Apr 24, 2024, 06:17 PM