నితిన్ పెళ్లి వాయిదా..

by సూర్య | Sun, Mar 29, 2020, 03:06 PM

కరోనా కష్టాలు అందర్నీ భయపెడుతున్నాయి. ఇప్పుడు హీరో నితిన్ పెళ్లికి కూడా ఈ కష్టాలు వచ్చాయి. ఈయన పెళ్లి ఇప్పుడు వాయిదా పడింది. ప్రపంచ దేశాలను గడగడలాడిస్తున్న కరోనా దెబ్బకు సినిమా వాళ్లు కూడా అష్టకష్టాలు పడుతున్నారు. ఇప్పటికే సినిమాలు వాయిదా పడుతున్నాయి.. షూటింగ్స్ ఆపేస్తున్నారు.. ఇప్పుడు నితిన్ పెళ్లి కూడా కరోనా కారణంగా వాయిదా పడింది. నాగర్‌ కర్నూల్‌లోని ప్రగతి నర్సింగ్‌ హోమ్‌ నిర్వహిస్తున్న డాక్టర్‌ సంపత్‌ కుమార్‌, నూర్జహాన్ కుమార్తె షాలినితో ఈ మధ్యే నితిన్‌కు నిశ్చితార్థం జరిగింది.ఈ జంట త్వరలో దుబాయ్‌లోని హోటల్ పలాజో వర్సాచీలో ఏప్రిల్‌ 16న పెళ్లి చేసుకోవాలనుకున్నారు. దీనికి ఏర్పాట్లు కూడా భారీగానే జరుగుతున్నాయి. అయితే ఇప్పుడు ఈ పెళ్లి కొన్ని రోజులు వాయిదా పడింది. ఈ విషయాన్ని స్వయంగా నితిన్ కన్ఫర్మ్ చేసాడు. మార్చ్ 30న ఈయన పుట్టిన రోజు. ఈ సందర్భంగా రాష్ట్రంలో ఎక్కడా తన పుట్టిన రోజు వేడుకలు జరపొద్దని అభిమానులను కోరాడు. తన పెళ్లి కూడా ఎప్రిల్ 16 నుంచి వాయిదా వేసుకున్నట్లు తెలిపాడు ఈయన. కరోనా వైరస్‌ వ్యాప్తి కారణంగా అరబ్‌ దేశాల్లో కఠినమైన ఆంక్షలు నెలకొన్న నేపథ్యంలో ఇప్పుడు నితిన్ పెళ్ళిని కొన్ని రోజులుగా పోస్ట్ పోన్ చేసారు. తర్వాత మంచి ముహూర్తం చూసుకుని మూడు ముళ్లు వేయనున్నాడు ఈ కుర్ర హీరో.

Latest News
 
రూ.50 లక్షలు విరాళం అందించిన హీరో శివకార్తికేయన్ Tue, Apr 23, 2024, 10:07 PM
3డిలో రానున్న 'జై హనుమాన్' మూవీ Tue, Apr 23, 2024, 08:57 PM
'భజే వాయు వేగం' టీజర్ కి భారీ స్పందన Tue, Apr 23, 2024, 07:42 PM
'పుష్ప 2' ఫస్ట్ సింగల్ విడుదల అప్పుడేనా? Tue, Apr 23, 2024, 07:33 PM
శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న 'శర్వా 36' Tue, Apr 23, 2024, 07:30 PM