మెగా అల్లుడితో అవికా గోర్..

by సూర్య | Sun, Mar 29, 2020, 02:49 PM

చిన్నారి పెళ్లి కూతురిగా టెలివిజన్ తెరకు పరిచయమై... ఆ తర్వాత యూత్ గుండెల్లో ఉయ్యాలా జంపాలా అంటూ ఊయలలూగిన భామ అవికా గౌర్. బాలనటిగా పరిచయమై ఆ తర్వాత హీరోయిన్‌గా మారి తన అందచందాలతో అటు తెలుగు, మళయాళం, తమిళ భాషల్లో దూసుకుపోతోంది. రాజ్ తరుణ్‌తో 'సినిమా చూపిస్తమావ'తో మరో హిట్ ను సొంతం చేసుకున్న ఈ అమ్మాయిని చూసి ఇక తెలుగులో ఒక రేంజ్ లో దూసుకుపోతుందని అంతా అనుకున్నారు. కానీ కొన్ని కారణాల వల్ల తెలుగులో గ్యాప్ తీసుకుంది. ఆ మధ్య ఓంకార్ దర్శకత్వంలో వచ్చిన 'రాజుగారి గది 3' లో మెరిసింది. అయితే ఆ సినిమా బాక్సాఫీస్ దగ్గర తుస్సుమనడంతో ఉపయోగం లేకుండా పోయింది. అయితే తాజాగా వస్తోన్న సమాచారం మేరకు ఈ భామకు అదిరిపోయే ఆఫర్ వచ్చిందని తెలుస్తోంది. అవికా గోర్.. చిరంజీవి చిన్నల్లుడు కల్యాణ్ దేవ్ జోడీగా కనిపించనున్నట్టు సమాచారం. 'విజేత' సినిమాతో తెలుగు తెరకి పరిచయమైన కళ్యాణ్ దేవ్, 'సూపర్ మచ్చి'తో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఆ సినిమా తరువాత శ్రీధర్ సీపాన దర్శకత్వంలో ఒక రొమాంటిక్ ఎంటర్టైనర్ చేస్తున్నాడు కళ్యాణ్ దేవ్. ఈ సినిమాలో హీరోయిన్ పాత్ర కోసం అవికా గోర్ ఎంపిక చేసుకుందట చిత్రబృందం. ఈ సినిమా గురించి పూర్తి సమాచారం త్వరలో వెల్లడికానుంది.

Latest News
 
విశ్వక్‌సేన్ ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ టీజ‌ర్ టైం ఫిక్స్! Wed, Apr 24, 2024, 01:44 PM
వేడుకగా నటి అపర్ణాదాస్ వివాహం Wed, Apr 24, 2024, 10:42 AM
10 మందిని ముద్దు పెట్టుకోమన్నారు: హీరోయిన్ Wed, Apr 24, 2024, 10:41 AM
రూ.50 లక్షలు విరాళం అందించిన హీరో శివకార్తికేయన్ Tue, Apr 23, 2024, 10:07 PM
3డిలో రానున్న 'జై హనుమాన్' మూవీ Tue, Apr 23, 2024, 08:57 PM