హాలీవుడ్ స్టార్ హీరోయిన్‌కు కరోనా ...

by సూర్య | Sun, Mar 29, 2020, 01:00 PM

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్‌ ఇప్పుడు సినిమా వాళ్లకు కూడా వచ్చేస్తుంది. ఇప్పటికే హాలీవుడ్‌లో టామ్ హ్యాంక్స్ దంపతులకు షూటింగ్ చేస్తుండగా కరోనా వచ్చింది. వాళ్లతో పాటు ఇంకా చాలా మందికి వచ్చింది. అందులో ముగ్గురు చనిపోయారు కూడా. ఇప్పటికే మూడు వారాల పాటు విద్యాసంస్థలు, పార్క్‌లు, జిమ్ములు, సినిమా థియేటర్లు, దేవాలయాలతో పాటు అన్నీ మూసేయాలని ఆజ్ఞాపించారు. సినిమా వాళ్లు కూడా తమకు తాముగా గృహ నిర్భందం చేసుకున్నారు. రోడ్లపైకి కూడా రావద్దని ప్రభుత్వం గట్టిగానే వార్నింగ్ ఇచ్చింది. ఇంత జాగ్రత్తగా ఉన్న నేపథ్యంలో ఇంకా ఈ కరోనా వైరస్ మహమ్మారి పీడిస్తూనే ఉంది.


ఇప్పుడు ప్రముఖ అమెరికన్ నటి, జుమాంటీ ఫేమ్ లారా బెల్ బండీకి కరోనా వైరస్ సోకింది. ఈ విషయాన్ని ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమె ప్రకటించింది. అది వచ్చినపుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో వివరించింది బెల్ బండీ. ఈమె వయసు 38 ఏళ్లు. కొన్నిరోజులుగా దగ్గు, జలుబు, తలనొప్పి, చాతి నొప్పి, జ్వరంతో బాధ పడుతున్నట్లు తెలిపింది బండీ. అంతకంతకూ వ్యాధి తీవ్రత పెరగడంతో శ్వాస కోస సంబంధమైన సమస్యలు సైతం వచ్చాయని చెబుతుంది. అయితే ఆ సమయంలో తనకు కరోనా వైరస్‌పై సరైన అవగాహన లేక వ్యాధి నిర్థారణకు ఆలస్యం అయ్యిందని తెలిపింది ఈమె.


కరోనా పాజిటివ్ అని తేలిన తర్వాత సెల్ఫ్ క్వారెంటైన్‌కు వెళ్లిపోయానని చెబుతుంది బండీ. ఈమె కంటే ముందు జేమ్స్ బాండ్ నటి ఓల్గా కురిలెంకోకి కూడా కరోనా పాజిటివ్ అని తేలింది. ఈ విషయాన్ని ఆమె స్వయంగా సోషల్ మీడియాలో వెల్లడించింది. పాజిటివ్ అని తేలిన తర్వాత తనకు డాక్టర్లు కేవలం పారాసిటమాల్ టాబ్లెట్ ఇచ్చారని.. ఎలాంటి జాగ్రత్తలు చెప్పలేదని చెప్పింది ఈమె. ఓల్గాకు కరోనా సోకిందని తెలిసి ఫ్యాన్స్ కంగారు పడుతున్నారు. దాంతో ఈమె స్వయంగా తన అనుభవాన్ని చెప్తూ ప్రజలకు, అభిమానులకు సూచనలు ఇస్తుంది. మొత్తానికి కరోనా కోరల నుంచి ఎలా తప్పించుకోవాలో తెలియక తికమకపడుతున్నారు ప్రజలు.

Latest News
 
'రాజా సాబ్' లో గోపీచంద్ Sat, Apr 20, 2024, 03:39 PM
నైట్ టైంలో స్విమ్మింగ్ పూల్ లో సమ్మోహనుడా అనే సాంగ్ చేశాను : నేహా శెట్టి Sat, Apr 20, 2024, 03:27 PM
యూట్యూబ్ ట్రేండింగ్ లో 'మిరాయ్' టైటిల్ గ్లింప్సె Sat, Apr 20, 2024, 03:27 PM
బాలీవుడ్‌లో 'పుష్ప-2' ఆల్ టైమ్ రికార్డ్! Sat, Apr 20, 2024, 03:23 PM
కార్తికేయ కోసం మెగా స్టార్ Sat, Apr 20, 2024, 03:19 PM