తెలుగు లవ్ స్టోరీస్ లో ఇషా రెబ్బ..

by సూర్య | Sun, Mar 29, 2020, 12:52 PM

తెలుగు సినీ ఇండస్ట్రీలో లోకల్ హీరోయిన్లు కనిపించడం చాలా అరుదు. అప్పట్లో ఇక్కడి వాళ్లనే హీరోయిన్లుగా తీసుకున్న సినీ నిర్మాతలు.. ఇప్పుడు మాత్రం వేరే ప్రాంతాల నుంచి దిగుమతి చేసుకుంటున్నారు. దీంతో తెలుగు హీరోయిన్లు కనిపించడమే లేదు. ఇలాంటి పరిస్థితుల్లో సైతం పోటీని తట్టుకుని నెట్టుకు వస్తోంది తెలుగందం ఈషా రెబ్బా. ‘అంతకు ముందు ఆ తర్వాత' సినిమాతో సినీరంగ ప్రవేశం చేసిన ఈషా రెబ్బ.. ఆ తర్వాత కొన్ని సినిమాలు చేసినా అవకాశాలను అందిపుచ్చుకోవడంలో సక్సెస్ కాలేకపోతోంది. అందం, టాలెంట్ ఉన్నా అవకాశాలు దొరకడం లేదు ఈ హాట్ బ్యూటీకి. ఆ మధ్య జూనియర్ ఎన్టీఆర్ నటించిన ‘అరవింద సమేత.. వీరరాఘవ'లో అవకాశం వచ్చినా.. ఆ పాత్రకు అంతగా ప్రాధాన్యత లేకపోవడంతో ఆమె ఫ్యాన్స్ నిరాశ పడ్డారు. అయితే టాలీవుడ్ ఫిల్మ్ మేకర్స్‌ను తన వైపునకు తిప్పుకునేందుకు ఈషా రెబ్బ సంచలన నిర్ణయం తీసుకుంది.హిందీలో నలుగురు దర్శకులు 'లస్ట్ స్టోరీస్' పేరుతో నెట్ ఫ్లిక్స్ కోసం ఒక అడల్ట్ వెబ్ సిరీస్ తీశారు. అందులో కియారా అద్వానీ హాట్ సీన్లో నటించిం సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే . ఇప్పుడు తెలుగులో లవ్ స్టోరీస్ పేరుతో అలాంటి ప్రయోగమే చేస్తోంది నెట్ ఫ్లిక్స్. ఈ సిరీస్ లో ఒక ఎపిసోడ్ లో ఇషా రెబ్బ నటిస్తోంది. ఈ ఎపిసోడ్ ని ఘాజి దర్శకుడు సంకల్ప్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ స్టోరీలోనే ఇషా రెచ్చిపోతుంది అనేది టాక్. అయితే ఈ సిరీస్ లో ప్రేమలో డోస్ మాత్రం ఎక్కువే ఉంటుందట. ముద్దులు, హగ్గులు.. ఇంకా మరిన్ని కొంత మోతాదు మించుతుంది అనే టాక్ వినిపిస్తోంది.

Latest News
 
మూవీ రివ్యూ: “టిల్లు స్క్వేర్” Fri, Mar 29, 2024, 12:45 PM
నేడు విడుదలకి సిద్ధమైన ‘గాడ్జిల్లా అండ్‌ కాంగ్‌’ Fri, Mar 29, 2024, 12:03 PM
ఏప్రిల్ 22న టైటిల్ చెబుతాం Fri, Mar 29, 2024, 12:01 PM
ఏప్రిల్ 5నుండి ott లోకి భీమా Fri, Mar 29, 2024, 12:00 PM
నేడు OTT లోకి రానున్న మ‌స్త్ షేడ్స్ ఉన్న‌య్ రా చిత్రం Fri, Mar 29, 2024, 12:00 PM