తమ్ముడి విడాకులపై ఆసక్తికరమైన కామెంట్స్ చేసిన మంచు విష్ణు

by సూర్య | Sun, Mar 29, 2020, 12:45 PM

ఈ మధ్య సినిమాలకు కాస్త దూరంగా ఉన్నాడు మంచు విష్ణు. వస్తే కచ్చితంగా మంచి సినిమాతోనే రావాలని.. ఆచారి అమెరికా యాత్ర లాంటి సినిమాలు చేస్తున్నపుడే అవి పోతాయని తెలిసినా చేయాల్సి వచ్చిందని చెప్పాడు ఈ మంచు వారబ్బాయి. కొన్ని రోజులుగా మీడియాకు కూడా దూరంగానే ఉన్న విష్ణు.. ఇప్పుడు యూ ట్యూబ్ ఛానెల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చాడు. అందులో కొన్ని ఆసక్తికరమైన విషయాలపై మాట్లాడాడు విష్ణు. ముఖ్యంగా తమ్ముడు మనోజ్ విడాకుల గురించి కూడా స్పందించాడు విష్ణు.


తన తమ్ముడు భార్యతో విడిపోతున్నాడని తెలిసినపుడు తామేం మాట్లాడలేదని.. అది అతడి జీవితం అనేసాడు విష్ణు. అయితే ఏదేమైనా కూడా తమ్ముడు విడాకులు తీసుకున్న తర్వాత తాను అతడికి చెప్పిన ఒకే ఒక్క మాట.. టేక్ యువర్ ఓన్ టైమ్ అని మాత్రమే అన్నాడు విష్ణు. ఎందుకంటే మన జీవితంలో కొన్ని సందర్భాల్లో కన్‌ఫ్యూజన్‌లోనో, డిప్రెషన్‌లోనే ఉంటారు.. అలాంటి సమయంలో తొందరపడి ఎలాంటి నిర్ణయం తీసుకోకూడదని చెబుతున్నాడు విష్ణు. ఆ ఉద్దేశ్యంతోనే మనోజ్‌కు అలా చెప్పానని గుర్తు చేసుకున్నాడు విష్ణు.


ఆ తర్వాత మనోజ్ మళ్లీ మామూలు మనిషి కావడానికి కొన్ని రోజులు పట్టినా కూడా ఇప్పుడు సినిమాలపై ఫోకస్ చేసాడని చెప్పాడు విష్ణు. ఇక తాము ముగ్గురం మోహన్ బాబుకు సరైన వారసులేనా అనే ప్రశ్న వచ్చినపుడు కూడా ఆసక్తికరమైన సమాధానం చెప్పాడు. ఈ ప్రశ్నకు సమాధానం కాలమే నిర్ణయిస్తుందని చెప్పాడు విష్ణు. ఈ ఇంటర్వ్యూలో తన పర్సనల్ విషయాల గురించి కూడా చాలానే చెప్పాడు ఈ హీరో. త్వరలోనే మోసగాళ్లు సినిమాతో పాటు భక్త కన్నప్పతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు విష్ణు.

Latest News
 
వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ తేదీ ఖరారు చేసిన 'చంద్రముఖి 2' Thu, Apr 25, 2024, 09:26 PM
సాలిడ్ టిఆర్పీని నమోదు చేసిన 'లియో' Thu, Apr 25, 2024, 09:23 PM
అనుపమ తదుపరి టైటిల్ మరియు కాన్సెప్ట్ వీడియోని లాంచ్ చేయనున్న సమంత, రాజ్ అండ్ DK Thu, Apr 25, 2024, 09:19 PM
'ఫ్యామిలీ స్టార్' నుండి దేఖో రే దేఖో వీడియో సాంగ్ అవుట్ Thu, Apr 25, 2024, 09:17 PM
షాకింగ్ టిఆర్పిని నమోద చేసిన 'ఆదికేశవ' Thu, Apr 25, 2024, 09:13 PM