పాపకు జన్మనిచ్చిన నటి స్నేహ

by సూర్య | Fri, Jan 24, 2020, 07:58 PM

అందాల నటి స్నేహ రెండోసారి తల్లయ్యారు. తాజాగా పండంటి పాపకు జన్మనిచ్చారు. ఈ విషయాన్ని ఆమె భర్త హీరో ప్రసన్న వెల్లడించారు. ఏంజెల్‌ వచ్చేసిందని ఇన్‌స్టాగ్రామ్‌ లో పోస్ట్‌ పెట్టారు. దీంతో పలువురు సినీ ప్రముఖులు స్నేహ-ప్రసన్న దంపతులకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. 2012 లో వీరిద్దరి వివాహం జరిగింది. ఈ దంపతులకు ఇప్పటికే విహాన్‌ అనే బాబు ఉన్నాడు. ఇటీవల సినిమాల్లో సెకండ్‌ ఇన్నింగ్స్‌ ప్రారంభించిన స్నేహ.. ధనుష్‌ హీరోగా తెరకెక్కిన తమిళ చిత్రం పటాస్‌లో నటించారు. సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ చిత్రం సూపర్ డూపర్ హిట్ అయింది.

Latest News
 
ఓటీటీలోకి సుందరం మాస్టర్ Thu, Mar 28, 2024, 01:38 PM
హీరో నవీన్ పొలిశెట్టికి యాక్సిడెంట్! Thu, Mar 28, 2024, 12:20 PM
పవన్ కల్యాణ్ ప్రచారానికి అనసూయ Thu, Mar 28, 2024, 10:59 AM
'టిల్లు స్క్వేర్' మూవీ ట్రైలర్ రిలీజ్ Wed, Mar 27, 2024, 10:45 PM
'చిత్రం చూడరా' ట్రైలర్ విడుదలకి తేదీ లాక్ Wed, Mar 27, 2024, 08:51 PM