కాజల్ కి సినిమా అవకాశాలు తగ్గాయా ?

by సూర్య | Fri, Jan 24, 2020, 04:27 PM

కాజల్ అగర్వాల్ ప్రస్తుతం  కమల్ హాసన్ హీరోగా నటిస్తోన్న ‘భారతీయుడు 2’లో 85 ఏళ్ల ముసలమ్మ పాత్రలో నటిస్తోంది. వాటితో పాటు బాలీవుడ్‌లో ‘ముంబాయి సాగా’ సినిమా చేస్తోంది. వీటిపైనే కాజల్ ఆశలన్ని.  ఈ చిత్రాల్ని ఎపుడో రెండేళ్ల క్రితం కాజల్ ఒప్పుకున్నవి. ఈ మధ్యలో ఈ భామ ఏ సినిమాకు సైన్ చేయలేదు. ఈ సినిమాల తర్వాత అవకాశాల కోసం  తనకు తెలిసిన అన్నిమార్గాలలోనూ ప్రయత్నాలు తీవ్రం చేస్తోంది కాజల్. ఇందులో భాగంగా తక్కువ పారితోషికంతోనే నటిస్తాను అనే ఆఫర్‌ కూడా ఇచ్చింది. సినిమాలు తగ్గుముఖం పట్టడంతో వెబ్‌ సీరీస్‌పై దృష్టి సారించింది. ఇప్పటికే నవతరం హీరోలతో నటించడానికి కూడా ఓకే చెప్పేస్తోంది ఈ చందమామ. తాజాగా ఒక మీడియాకిచ్చిన ఇంటర్వ్యూ లో "తాను సినిమాకు పరిచయమైన కొత్తలో పరిస్థితి వేరు. ఇపుడున్న పరిస్థితులు వేరని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం తాను నటిగా చాలా పరిణితి చెందానని చెప్పుకొచ్చింది. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో రిస్క్‌ తీసుకోవడానికి భయపడనని చెప్పింది. అందుకే ప్రయోగాత్మక పాత్రల్లో నటించాలని నిర్ణయించుకున్నట్లు పేర్కొంది. ఇంకా కథలో తన పాత్ర బాగుంటే కొత్తనటులతో జత కట్టడానికి కూడా రెడీ అని తెలిపింది. ప్రస్తుతం తనకు తగ్గుతున్న అవకాశాల గురించి మాట్లాడుతూ ప్రస్తుతం తనకు రెస్ట్ లేకపోవడం వల్లనే సినిమాలు ఒప్పుకోవడం లేదని.. కొన్ని రోజులు విశ్రాంతి తీసుకున్నాక మళ్లీ సినిమాలు చేస్తానని కవరింగ్ ఇస్తుంది. ఈ ఏడాది తన నట జీవితం ఇంకా విజయవంతంగా ఉంటుందనే విశ్వాసాన్ని నటి కాజల్‌ అగర్వాల్‌ ఆశా భావం వ్యక్తం చేసింది.

Latest News
 
రూ.50 లక్షలు విరాళం అందించిన హీరో శివకార్తికేయన్ Tue, Apr 23, 2024, 10:07 PM
3డిలో రానున్న 'జై హనుమాన్' మూవీ Tue, Apr 23, 2024, 08:57 PM
'భజే వాయు వేగం' టీజర్ కి భారీ స్పందన Tue, Apr 23, 2024, 07:42 PM
'పుష్ప 2' ఫస్ట్ సింగల్ విడుదల అప్పుడేనా? Tue, Apr 23, 2024, 07:33 PM
శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న 'శర్వా 36' Tue, Apr 23, 2024, 07:30 PM