రజనీ ఆ మూవీ స్టోరీ కాపీ కాదంట!

by సూర్య | Fri, Jan 24, 2020, 02:44 PM

2014లో సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన ‘లింగా’ చిత్రం విడుదలైన సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని కె.ఎస్.రవికుమార్ డైరెక్ట్ చేయగా రాక్ లైన్ వెంకటేష్ నిర్మించారు. ఈ సినిమా విడుదల సమయంలో స్టోరీ కాపీ కొట్టారంటూ డైరెక్టర్ రవిరత్నం మధురై కోర్టులో కేసు వేశారు. కథను తన ‘ముల్లై వానమ్ 999’ సినిమా నుండి తీసుకున్నారని ఆయన ఆరోపించారు. అప్పట్లో ఈ కేసు చాలానే దుమారం రేపింది. కోర్టు రూ.10 కోట్ల ఇన్సూరెన్స్ మీద సినిమా విడుదలకు అనుమతించింది. ఇన్నాళ్ళు విచారణలో ఉన్న ఈ కేసులో కోర్టు తీర్పును వెలువరించింది. కథ కాపీ కాదని తీర్పును వెలువరించింది. దీంతో నిర్మాత రాక్ లైన్ వెంకటేష్ కు పెద్ద ఊరట లభించినట్లైంది. ఇకపోతే ఇటీవలే ‘దర్బార్’ చిత్రంతో పలకరించిన రజనీ ప్రస్తుతం శివ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నారు.

Latest News
 
వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ తేదీ ఖరారు చేసిన 'చంద్రముఖి 2' Thu, Apr 25, 2024, 09:26 PM
సాలిడ్ టిఆర్పీని నమోదు చేసిన 'లియో' Thu, Apr 25, 2024, 09:23 PM
అనుపమ తదుపరి టైటిల్ మరియు కాన్సెప్ట్ వీడియోని లాంచ్ చేయనున్న సమంత, రాజ్ అండ్ DK Thu, Apr 25, 2024, 09:19 PM
'ఫ్యామిలీ స్టార్' నుండి దేఖో రే దేఖో వీడియో సాంగ్ అవుట్ Thu, Apr 25, 2024, 09:17 PM
షాకింగ్ టిఆర్పిని నమోద చేసిన 'ఆదికేశవ' Thu, Apr 25, 2024, 09:13 PM