‘అల వైకుంఠపురములో' నుండి సిత్తరాల సిరపడు సాంగ్ లిరికల్ వీడియో!

by సూర్య | Fri, Jan 17, 2020, 12:20 PM

స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ దర్శకత్వంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా వస్తోన్న ‘అల వైకుంఠపురములో’.  భారీ అంచనాల నడుమ విడుదలైన ‘అల వైకుంఠపురములో’ చిత్రం భారీ వసూళ్లను రాబడుతోంది. అల వైకుంఠపురంలో మూవీలో దర్శకుడు త్రివిక్రమ్ చాలా ప్రయోగాలే చేశారు. అందులో భాగంగా శ్రీకాకుళం స్లాంగ్ లో పల్లెటూరి జానపదంలా సాగే ఓ పాటలో మెస్మరైజింగ్ ఫైట్ రూపొందించాడు. ఆ ఫైట్ సీన్ తెరకెక్కించిన విధానం ప్రేక్షకులకు తెగ నచ్చేసింది. దీనితో ఈ ఫైట్ సీక్వెన్స్ లో వాడిన సిత్తరాల సిరపడు సాంగ్ లిరికల్ వీడియోని నేడు విడుదల చేశారు. థమన్ స్వరాలకు సూరన్న, సాకేత్ అద్బుతంగా పాడారు. అల వైకుంఠపురంలో చిత్రంలోని గత సాంగ్స్ వలే ఈ సాంగ్ కూడా ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకోవడం ఖాయంగా కనిపిస్తుంది. ఏడాదిన్నర తరువాత ఓ మూవీతో వచ్చిన బన్నీ బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. ఈ చిత్రంతో బన్నీ యూఎస్ లో కొత్త రికార్డ్స్ నమోదు చేస్తున్నారు . హారిక అండ్ హాసిని క్రియేషన్స్ మరియు గీతా ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ మూవీలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటించగా, సుశాంత్, నివేద పేతురాజ్, టబు, జయరాం, సముద్ర ఖని కీలక పాత్రలు చేశారు. ఈ చిత్రానికి సంగీతం థమన్ అందించారు.

Latest News
 
ప్రముఖ మలయాళ కథా రచయిత బలరామ్ కన్నుమూత Thu, Apr 18, 2024, 10:06 PM
కబీర్ సింగ్ సినిమాలో మిమ్మల్ని తీసుకున్నందుకు బాధపడుతున్నాను : సందీప్ రెడ్డి Thu, Apr 18, 2024, 10:01 PM
కీలక షెడ్యూల్ ని పూర్తి చేసుకున్న 'మిస్టర్ బచ్చన్' Thu, Apr 18, 2024, 07:18 PM
'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' USA రైట్స్ ని సొంతం చేసుకున్న ప్రముఖ బ్యానర్ Thu, Apr 18, 2024, 07:16 PM
'కల్కి 2898 AD' గురించిన లేటెస్ట్ అప్డేట్ Thu, Apr 18, 2024, 07:14 PM