అక్కడ ‘అల వైకుంఠపురములో’ కలెక్షన్ల వర్షం!

by సూర్య | Thu, Jan 16, 2020, 08:03 PM

స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ దర్శకత్వంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా వస్తోన్న ‘అల వైకుంఠపురములో’.  భారీ అంచనాల నడుమ విడుదలైన ‘అల వైకుంఠపురములో’ చిత్రం భారీ వసూళ్లను రాబడుతోంది. ‘అల వైకుంఠపురములో’ చిత్రం యూఎస్ బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. మొదటిరోజు ఎలాంటి దూకుడైతే చూపిందో ఇప్పుడు కూడా అదే జోరు కొనసాగిస్తోంది. నిన్నటికి 1.7 మిలియన్ మార్కును అందుకున్న ఈ చిత్రం నేటితో 1.8 మిలియన్ మార్కును టచ్ చేసింది. ఈ మొత్తం శుక్రవారం నాటికి రెండు మిలియన్లను చేరుకునే అవకాశం ఉంది. ఈ వసూళ్లతో 2020లో ఓవర్సీస్ మార్కెట్లో అత్యధిక మొత్తం రాబట్టిన తొలి తెలుగు చిత్రంగా నిలబడింది. వసూళ్ల జోరు చూసిన అక్కడి డిస్ట్రిబ్యూటర్లు స్క్రీన్ల సంఖ్యను పెంచారు. దీంతో చిత్రం ఇంకాస్త వేగంగా 2 మిలియన్ మార్కును అందుకోనుంది. మొత్తం మీద సినిమాకు లభిస్తున్న ఆదరణ చూస్తే బన్నీ కెరీర్లో అత్యధిక ఓవర్సీస్ వసూళ్లను నమోదనమోదు చేసేలా కనబడుతోంది.

Latest News
 
'తలైవర్ 171' టైటిల్ టీజర్ విడుదల ఎప్పుడంటే...! Thu, Mar 28, 2024, 08:24 PM
'గేమ్ ఛేంజర్' డిజిటల్ రైట్స్ ని సొంతం చేసుకున్న ప్రముఖ ప్లాట్ఫారం Thu, Mar 28, 2024, 08:21 PM
'శ్రీరంగనీతులు' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కి వెన్యూ లాక్ Thu, Mar 28, 2024, 08:19 PM
'శశివదనే' నుండి గోదారి అటువైపో సాంగ్ రిలీజ్ Thu, Mar 28, 2024, 08:17 PM
త్వరలో స్మాల్ స్క్రీన్ పై ఎంట్రీ ఇవ్వనున్న 'అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్' Thu, Mar 28, 2024, 08:15 PM