'అమృతం' మళ్ళీ వచ్చేస్తుంది...

by సూర్య | Thu, Jan 16, 2020, 04:52 PM

సీరియళ్లు అంటే ఏడుపుగొట్టే సన్నివేశాలు.. సాగదీసే ఎపిసోడ్లు అని చాలామంది ప్రేక్షకుల్లో ఒక అభిప్రాయం వుంది. మొదటి సారి ఆ అభిప్రాయం తప్పని చెప్పింది మాత్రం 'అమృతం' సీరియల్. కడుపుబ్బా నవ్వించే ఎపిసోడ్ లతో, ఎపిసోడ్ కి ఒక కొత్త టాపిక్ తో జనాలని ఎంతగానో ఆకట్టుకుంది. అమృతం సీరియల్ కొద్ది రోజులు ప్రేక్షకులకు దూరమైనా అమృతం, ఆంజనేయులు, సర్వం, అప్పాజీ వంటి పాత్రలు తెలుగు వారికి ఎప్పుడూ దగ్గరగానే ఉంటాయి. అలాంటి జనాదరణ పొందిన 'అమృతం' మళ్ళీ ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్దమవుతుంది. ఇప్పుడు అమృతం పార్ట్ 2 ను అమృతం ద్వితీయం పేరుతో తీసుకురాబోతుండడం విశేషం. గుణ్ణం గంగరాజు సారధ్యంలో ఆయన కొడుకు సందీప్ గుణ్ణం తెరకెక్కించనున్న ఈ సెకండ్ పార్ట్ ప్రస్తుతం స్క్రిప్టింగ్ దశలో ఉంది. ఈ ఏడాదే ఎపిసోడ్స్ లైవ్ కాబోతున్నాయని అంటున్నారు. అయితే ఆంజనేయులు పాత్ర పోషించడానికి గుండు హనుమంతరావు ఇప్పుడు మన మధ్య లేరు. ఇక అమృతంగా మెప్పించిన హర్షవర్ధన్ కూడా సినిమాలతో బిజీగా వున్నారు కూడా పెరిగింది. మరి ఈ పాత్రలకు ఎవరిని తీసుకుంటారో అన్నది ఆసక్తికరంగా మారింది.

Latest News
 
సూర్య కొత్త సినిమాపై అప్‌డేట్ Fri, Mar 29, 2024, 02:24 PM
లాంగ్ బ్లాక్ గౌన్ లో బుట్టబొమ్మలా రష్మీ Fri, Mar 29, 2024, 01:44 PM
మూవీ రివ్యూ: “టిల్లు స్క్వేర్” Fri, Mar 29, 2024, 12:45 PM
నేడు విడుదలకి సిద్ధమైన ‘గాడ్జిల్లా అండ్‌ కాంగ్‌’ Fri, Mar 29, 2024, 12:03 PM
ఏప్రిల్ 22న టైటిల్ చెబుతాం Fri, Mar 29, 2024, 12:01 PM