సింగర్స్ గా అవతారం ఎత్తిన రవితేజ!

by సూర్య | Thu, Jan 16, 2020, 04:32 PM

హీరోలు సింగర్స్ గా అవతారం ఎత్తడం కొత్త విషయం ఏమీ కాదు .  అందరూ ఎదో ఓ సందర్భంలో తమ గళాల్ని సవరించుకున్న వారే ఆ కోవలోకి తాజాగా రవితేజ కూడా చేరాడు . అయితే రవితేజ పాడటం ఇది తొలిసారి కాకపోయినా గతంలో రవితేజ ఎదో చిన్న చిన్న పార్ట్స్ వరకూ పాడి వదిలేసాడు . అయితే ఈ సారి రవితేజ కంప్లీట్ గా పాట మొత్తం పాడాడట. ఇంతకీ రవితేజ పాట పాడిన ఆ సినిమా మరేదో కాదు డిస్కోరాజా . జనవరి 24న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోన్న ఈ సినిమా గురించి ఎస్. ఎస్. తమన్ ఓ ఆసక్తికర విషయాన్ని ట్విట్టర్ వేదికగా షేర్ చేశారు. ఈ సినిమాలో ఓ మాస్ సాంగ్‌ను రవితేజ ఆలపించారట. ఇంతకు ముందు కూడా థమన్ సారథ్యంలోనే ఓ పాటలో చిన్న బిట్ పాడిన రవితేజ, ఇప్పుడు 'డిస్కోరాజా' కోసం ఫుల్ సాంగ్‌ను పాడటం విశేషం. ఈ సాంగ్‌కు థమన్ ఇచ్చిన ట్యూన్స్ అదిరిపోయాయని చెబుతున్నారు. అలాగే ఈ సాంగ్‌ను రియల్ సింగర్స్‌ తీసుకునే టైమ్ కంటే తక్కువ టైమ్‌లో రవితేజ ఆలపించారని థమన్ ట్వీట్‌లో తెలిపారు. ప్రస్తుతం ఈ విషయం రవితేజ అభిమానులకు మాంచి కిక్ ఇస్తోంది.

Latest News
 
నటుడు దీపక్ పరంబోల్‌ను వివాహం చేసుకున్న నటి అపర్ణా దాస్ Wed, Apr 24, 2024, 04:06 PM
'మంజుమ్మెల్ బాయ్స్' OTT ఎంట్రీపై లేటెస్ట్ బజ్ Wed, Apr 24, 2024, 04:04 PM
'సత్యభామ' ఫస్ట్ సింగల్ విడుదలకి తేదీ ఖరారు Wed, Apr 24, 2024, 03:59 PM
యూట్యూబ్ ట్రేండింగ్ లో 'భజే వాయు వేగం' టీజర్ Wed, Apr 24, 2024, 03:56 PM
బుధవారం విక్టరీ వెంకటేష్ స్పెషల్ మూవీస్ Wed, Apr 24, 2024, 03:48 PM