పవన్ కళ్యాణ్ ‘పింక్’ రీమేక్ నుంచి లేటెస్ట్ అప్డేట్!

by సూర్య | Thu, Jan 16, 2020, 03:21 PM

పవన్ కళ్యాణ్ రీఎంట్రీ ఇవ్వనున్న ‘పింక్’ తెలుగు రీమేక్  ఒరిజినల్ వెర్షన్ కంటే చాలా భిన్నంగా ఉంటుందట. తెలుగు ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టు చాలానే మార్పులు చేసినట్టు తెలుస్తోంది. ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని వేణు శ్రీరామ్ డైరెక్ట్ చేయనున్నారు. ప్రస్తుతం రాజకీయాల్లో ఉన్నందున ఒక సామాజిక సందేశం ఉన్న సినిమాను చేయాలనే ఉద్దేశ్యంతో పవన్ ఈ చిత్రాన్ని ఎంచుకున్నారు.  ‘పింక్’ తెలుగు రీమేక్ షూటింగ్ ఈ నెల 20 నుండి మొదలుకానున్న సంగతి తెలిసిందే. అయితే ఈ షూట్లో మొదట పవన్ మీద ఒక ఫైట్‌ను చిత్రీకరిస్తారట. సినిమాలో కూడా ఇదే తొలి సన్నివేశంగా ఉంటుందట. లాంగ్ గ్యాప్ తర్వాత పవన్ స్క్రీన్ మీద కనబడనున్న తొలి సన్నివేశం ఫైట్‌ కావడం అభిమానులకు మంచి కిక్ ఇచ్చే విషయమే. ఈ సంధర్భాన్ని వారు బాగా ఎంజాయ్ చేయవచ్చు.

Latest News
 
రూ.50 లక్షలు విరాళం అందించిన హీరో శివకార్తికేయన్ Tue, Apr 23, 2024, 10:07 PM
3డిలో రానున్న 'జై హనుమాన్' మూవీ Tue, Apr 23, 2024, 08:57 PM
'భజే వాయు వేగం' టీజర్ కి భారీ స్పందన Tue, Apr 23, 2024, 07:42 PM
'పుష్ప 2' ఫస్ట్ సింగల్ విడుదల అప్పుడేనా? Tue, Apr 23, 2024, 07:33 PM
శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న 'శర్వా 36' Tue, Apr 23, 2024, 07:30 PM