చెన్నై రజిని 'దర్బార్' కలెక్షన్ల జోరు!

by సూర్య | Thu, Jan 16, 2020, 12:47 PM

ఏఆర్‌ మురుగదాస్‌ దర్శకత్వం రజినీకాంత్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం దర్బార్.  దర్బార్ మూవీలో రజిని పోలీస్ అధికారి పాత్ర చేస్తున్నారు. ముంబై నేపథ్యంలో నడిచే మాఫియా యాక్షన్ ఎంటర్టైనర్ అని తెలుస్తుంది. నయనతార హీరోయిన్ గా నటిస్తుంది. సూపర్ స్టార్ రజని యాక్షన్ ఎంటర్టైనర్ దర్బార్ 9వ తేదీన విడుదలైంది. అయితే తమిళనాడులో రజిని దర్బార్ వసూళ్ల సునామి సృష్టిస్తుంది. ముఖ్యంగా చెన్నై సిటీ పరిధిలో దర్బార్ మూవీ వసూళ్ల జోరు కొనసాగుతుంది.ఎంత మంది హీరోలు వచ్చినా రజిని మేనియా కొంచెం కూడా తగ్గలేదని ఈ బాక్సాపీస్ కలెక్షన్స్ నిరూపిస్తున్నాయి. విడుదలైన ఏడు రోజులలోనే ఈ చిత్రం చెన్నై సిటీ పరిధిలో 10 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ అందుకుంది. చెన్నై సిటీలో ఇప్పటికీ హైయెస్ట్ గ్రాస్సింగ్ మూవీగా రజిని 2.0 కొనసాగుతుంది. వరల్డ్ వైడ్ గా దర్బార్ ఇప్పటికే వంద కోట్ల మార్క్ దాటివేసింది. దర్బార్ మూవీతో రజిని మరో బ్లాక్ బస్టర్ తన ఖాతాలో వేసుకున్నారు.

Latest News
 
ముంబైలో ప్రారంభమైన 'కుబేర' కొత్త షెడ్యూల్ Thu, Apr 25, 2024, 08:51 PM
'కృష్ణమ్మ' ట్రైలర్ లాంచ్ కి వెన్యూ లాక్ Thu, Apr 25, 2024, 08:49 PM
హరోమ్‌హర : అన్ని మ్యూజిక్ ప్లాట్‌ఫారమ్‌లలో స్ట్రీమింగ్ అవుతున్న 'కనులెందుకో' సాంగ్ Thu, Apr 25, 2024, 08:47 PM
ఆ ఒక్కటి అడక్కు : హమ్మమ్మో సాంగ్ ప్రోమో అవుట్ Thu, Apr 25, 2024, 08:42 PM
'సత్యభామ' లోని కళ్లారా లిరికల్ వీడియో అవుట్ Thu, Apr 25, 2024, 08:38 PM