నాగచైతన్య-సాయిపల్లవిల మూవీ నుంచి లేటెస్ట్ అప్డేట్!

by సూర్య | Tue, Jan 14, 2020, 04:39 PM

శేఖర్ కమ్ముల దర్శకత్వంలో  నాగచైతన్య , సాయిపల్లవి హీరోహీరోయిన్లుగా సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. కాగా తాజాగా ఈ సినిమా టైటిల్ ను ఈ రోజు అధికారికంగా ప్రకటించనున్నారు. సాయంత్రం 6 గంటల 3 నిముషాలకు ఈ సినిమా టైటిల్ రివీల్ చేయనున్నారు. అయితే ఈ సినిమాకి ‘లవ్ స్టోరీ’ అని టైటిల్ పెట్టినట్లు సోషల్ మీడియాలో రూమర్స్ వస్తున్నాయి. మరి ఏ టైటిల్ పెట్టారనేది ఈ సాయంత్రం తేలనుంది. ఇక ఏప్రిల్ 2న ఈ సినిమాని విడుదల చేయనున్నారు. బలమైన కథలతో సినిమాలు తీసే డైరెక్టర్ గా మంచి పేరు ఉన్న శేఖర్ కమ్ముల.. ఫిదా లాంటి సెన్సేషనల్ హిట్ తరువాత చేస్తోన్న సినిమా కావడంతో ఈ సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి. డిస్ట్రిబ్యూటర్స్ గా ఇప్పటి వరకూ వందలాది సినిమాలను విడుదల చేసిన ఏసియన్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఈ సినిమాతో ఫస్ట్ టైమ్ నిర్మాణ రంగంలోకి దిగుతోంది. కాగా నారాయణదాస్ నారంగ్, ఎఫ్.డి.సి చైర్మైన్ రామ్మోహనరావు ఈ చిత్రానికి నిర్మాతలు. ఏషియన్ వంటి పెద్ద కంపెనీ నిర్మిస్తుండటం వల్ల ఇప్పుడీ ప్రాజెక్ట్ పై టాలీవుడ్ లో మంచి అంచనాలు ఉన్నాయి.

Latest News
 
కన్నడ నటి హర్షిక పూనాచా, ఆమె భర్త పై దుండగులు దాడి Sat, Apr 20, 2024, 10:39 AM
'మంజుమ్మెల్ బాయ్స్' OTT రిలీజ్ డేట్ ఫిక్స్ Sat, Apr 20, 2024, 10:36 AM
'ప్రేమలు' సినిమాకి సీక్వెల్ రెడీ Fri, Apr 19, 2024, 11:34 PM
మెగాస్టార్​ చిరంజీవితో రష్యా ప్రతినిధుల సమావేశం Fri, Apr 19, 2024, 08:54 PM
100M స్ట్రీమింగ్ నిమిషాలను క్రాస్ చేసిన 'గామి' Fri, Apr 19, 2024, 08:23 PM