బన్నీకి పవర్ స్టార్ విషెష్...!

by సూర్య | Tue, Jan 14, 2020, 02:36 PM

స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ దర్శకత్వంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా వస్తోన్న ‘అల వైకుంఠపురములో’.  భారీ అంచనాల నడుమ విడుదలైన ‘అల వైకుంఠపురములో’ చిత్రం భారీ వసూళ్లను రాబడుతోంది. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా విదేశాల్లో సైతం మంచి వసూళ్లను రాబడుతోంది. కాగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అల చిత్ర యూనిట్ కు బెస్ట్ విషెష్ అందించారు.బన్నీకి శుభాకాంక్షలు తెలుపుతూ సోషల్‌ మీడియా ట్రెండ్స్ సెట్ అవుతోంటే తాజాగా అల్లు అర్జున్‌ మామయ్య, పవర్‌ స్టార్ పవన్‌ కళ్యాన్ బన్నీకి శుభాకాంక్షలు తెలుపుతూ ఫ్లవర్‌ బొకేను పంపించాడు. ఈ విషయాన్ని తన సోషల్‌ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నాడు బన్నీ. బన్నీకి ఫ్లవర్‌ బోకే పంపిన పవన్‌, ఆ బోకే తో పాటు ఓ సందేశాన్ని పంపించాడు. గౌరవనీయులైన అల్లు అర్జున్‌ గారు, అల వైకుంఠపురములో సినిమాలో ఘనవిజయం సాధించిన సందర్భంగా శుభాకాంక్షలు. భవిష్యత్తులో మీరు చేయబోయే సినిమాలకు ఆల్‌ ది బెస్ట్` అంంటూ తానే స్వయంగా ఓ లెటర్‌ రాసి పంపించాడు. అయితే ఈ లెటర్‌ను ట్విటర్‌లో పోస్ట్ చేసిన బన్నీ `పవన్‌ కళ్యాణ్‌ గారి నుంచి శుభాకాంక్షలు రావటం ఎంతో సంతోషంగా ఉంది. థ్యాంక్యూ వెరీ మచ్‌ పవన్‌ కళ్యాణ్‌ గారు` అంటూ ట్వీట్ చేశాడు. 






 

Latest News
 
కొత్త విడుదల తేదీని లాక్ చేసిన 'లవ్ మి - ఇఫ్ యు డేర్' Wed, Apr 24, 2024, 07:54 PM
15M+ వ్యూస్ ని సొంతం చేసుకున్న 'మిరాయి' టైటిల్ టీజర్ Wed, Apr 24, 2024, 07:52 PM
మరో రెండు రోజులలో 'టిల్లు స్క్వేర్' OTT ఎంట్రీ Wed, Apr 24, 2024, 06:21 PM
'థగ్ లైఫ్‌' సెట్స్ లో జాయిన్ అయ్యిన త్రిష Wed, Apr 24, 2024, 06:19 PM
3M+ వ్యూస్ ని సొంతం చేసుకున్న 'ఆ ఒక్కటి అడక్కు' ట్రైలర్ Wed, Apr 24, 2024, 06:17 PM