'అల వైకుంఠపురములో' లేటెస్ట్ కలెక్షన్స్ !

by సూర్య | Tue, Jan 14, 2020, 02:13 PM

స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ దర్శకత్వంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా వస్తోన్న ‘అల వైకుంఠపురములో’.  భారీ అంచనాల నడుమ విడుదలైన ‘అల వైకుంఠపురములో’ చిత్రం భారీ వసూళ్లను రాబడుతోంది. ఫస్ట్ హాఫ్‌ బన్నీ కామెడీ టైమింగ్, త్రివిక్రమ్‌ మార్క్‌ టేకింగ్, డైలాగ్స్‌ సూపర్బ్‌ అన్న టాక్‌ వినిపిస్తోంది. ముఖ్యంగా బన్నీ క్యారెక్టర్‌ చించేశాడంటున్నారు ఫ్యాన్స్‌. ఫస్ట్ హాఫ్‌లో కామెడీ బాగా వర్క్‌ అవుట్ అయ్యిందని, ముఖ్యంగా ఇంటర్వెల్ బ్లాక్‌ సూపర్బ్‌ అనిపించేలా ఉందంటున్నారు ఫ్యాన్స్‌. అలాగే అటు క్లాస్, ఇటు మాస్ అని తేడా లేకుండా అన్ని వర్గాల ప్రేక్షకులని మెప్పించి బ్లాక్ బస్టర్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అనిపించుకుంటున్న ఈ సినిమాకి ఫస్ట్ రోజు లానే రెండవ రోజు కూడానా బాక్స్ ఆఫీస్ షేక్ అయ్యేలాంటి కలెక్షన్స్ వచ్చాయి. మొదటి రోజు 26.5 కోట్ల షేర్ తో అల్లు అర్జున్ కెరీర్ బెస్ట్ అనిపించుకోగా.. ఆంధ్ర - తెలంగాణ షేర్స్ లో 6వ స్థానంలో నిలిచింది. ఇక రెండో రోజు కూడా అదే స్పీడు కంటిన్యూ చేసింది. అల వైకుంఠపురములో రెండవ రోజు 10 కోట్ల షేర్ ని రిజిష్టర్ చేసింది. కాంపిటీషన్ హై రేంజ్ లో ఉన్నప్పటికీ సెకండ్ డే అన్ని చోట్లా అన్ని షోస్ హౌస్ ఫుల్స్ తో రన్ అవడం వలన ఈ రేంజ్ కలెక్షన్స్ వచ్చాయని చెప్పాలి. రెండో రోజు ముగిసేసరికి ఈ మూవీ 33 నుంచి 35 కోట్ల షేర్ వసూలు చేసిందని ట్రేడ్ వర్గాలు చెప్పాయి.


'అల వైకుంఠపురములో' ఆంధ్ర - తెలంగాణ 2డేస్ బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్:


నైజాం - 9.5 కోట్లు


సీడెడ్ - 5.60 కోట్లు


గుంటూరు - 4.24 కోట్లు


ఉత్తరాంధ్ర - 4.45 కోట్లు


తూర్పు గోదావరి - 3.65 కోట్లు


పశ్చిమ గోదావరి - 2.93 కోట్లు


కృష్ణా - 3.61 కోట్లు


నెల్లూరు - 1.62 కోట్లు


2డేస్డే మొత్తం షేర్ - 35.61 కోట్లు

Latest News
 
నేడు విడుదలకి సిద్ధమైన ‘గాడ్జిల్లా అండ్‌ కాంగ్‌’ Fri, Mar 29, 2024, 12:03 PM
ఏప్రిల్ 22న టైటిల్ చెబుతాం Fri, Mar 29, 2024, 12:01 PM
ఏప్రిల్ 5నుండి ott లోకి భీమా Fri, Mar 29, 2024, 12:00 PM
నేడు OTT లోకి రానున్న మ‌స్త్ షేడ్స్ ఉన్న‌య్ రా చిత్రం Fri, Mar 29, 2024, 12:00 PM
బాలీవుడ్‌కి వెళ్తే అన్నీ వదిలేయాలి: త్రిష Fri, Mar 29, 2024, 10:34 AM