'అల వైకుంఠపురములో' ఏరియావైస్ 'ఫస్ట్ డే' కలెక్షన్స్

by సూర్య | Mon, Jan 13, 2020, 05:22 PM

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో వచ్చిన లేటెస్ట్ చిత్రం 'అల వైకుంఠపురములో' సూపర్ హిట్ దిశగా దూసుకుపోతోంది. తొలి షో నుండే ఈ చిత్రానికి పాజిటివ్ టాక్ మొదలై నెమ్మదిగా అది సూపర్ హిట్ టాక్ గా మారింది. త్రివిక్రమ్ శ్రీనివాస్ రచన, డైరెక్షన్ పరంగా మరోసారి మ్యాజిక్ చేసాడని రిపోర్ట్స్ వచ్చాయి. నా పేరు సూర్య ప్లాప్ తో బాగా గ్యాప్ తీసుకుని మరో సినిమా చేసిన అల్లు అర్జున్ అల వైకుంఠపురములో చిత్రం ద్వారా హిట్ కొట్టి బౌన్స్ బ్యాక్ అయ్యాడు. ఈ సినిమా మహేష్ బాబు నటించిన సరిలేరు నీకెవ్వరు చిత్రంతో పోటీ పడుతున్నా వసూళ్ళలో మాత్రం ఎక్కడా తగ్గట్లేదు. మొదటి రోజు విడుదలైన ప్రతి థియేటర్ లోనూ ప్రతి షో హౌస్ ఫుల్ కావడం, అదనంగా షోస్ వేయడం, టికెట్ హైక్స్ ఇవన్నీ కలిపి అల వైకుంఠపురములో చిత్రానికి బంపర్ ఓపెనింగ్స్ వచ్చాయి.


జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి తర్వాత బన్నీ - త్రివిక్రమ్ జోడి మరోసారి అలరించింది. అల వైకుంఠపురములో చిత్రం తొలి రోజే 26 కోట్లకు పైగా షేర్ ను వసూలు చేయడం విశేషం. ఇది అల్లు అర్జున్ కెరీర్ లోనే హయ్యస్ట్ ఓపెనింగ్. ప్రతి ఏరియాలో ఈ చిత్రం ద్వారా తన కెరీర్ బెస్ట్ ను సాధించాడు బన్నీ, కృష్ణ, గుంటూరు వంటి ఏరియాల్లో ఆల్ టైమ్ రికార్డును సైతం సొంతం చేసుకున్నాడు.


అల వైకుంఠపురములో ఫస్ట్ డే కలెక్షన్స్ వివరాలు ఇలా ఉన్నాయి:


నైజాం : 6.03 కోట్లు


సీడెడ్ : 4.03 కోట్లు


గుంటూరు : 3.42 కోట్లు


ఉత్తరాంధ్ర : 2.9 కోట్లు


తూర్పు గోదావరి : 3 కోట్లు


పశ్చిమ గోదావరి : 2.42 కోట్లు


కృష్ణా : 3.11 కోట్లు


నెల్లూరు : 1.3 కోట్లు


ఆంధ్ర + తెలంగాణ : 26.76 కోట్లు


ఓవర్సీస్ లో కూడా ఈ చిత్రం దూసుకుపోతోంది. ప్రీమియర్స్ తోనే 800K మార్క్ ను దాటిన ఈ చిత్రం తొలిరోజు వసూళ్లు కూడా కలుపుకుంటే దాదాపు 1.3 మిలియన్ డాలర్స్ కు చేరువవుతుంది. సంక్రాంతి హంగామా కూడా మొదలవుతుండడంతో అల వైకుంఠపురములో చిత్రం మరింత పుంజుకునే అవకాశాలు ఉన్నాయి.

Latest News
 
ప్రముఖ మలయాళ కథా రచయిత బలరామ్ కన్నుమూత Thu, Apr 18, 2024, 10:06 PM
కబీర్ సింగ్ సినిమాలో మిమ్మల్ని తీసుకున్నందుకు బాధపడుతున్నాను : సందీప్ రెడ్డి Thu, Apr 18, 2024, 10:01 PM
కీలక షెడ్యూల్ ని పూర్తి చేసుకున్న 'మిస్టర్ బచ్చన్' Thu, Apr 18, 2024, 07:18 PM
'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' USA రైట్స్ ని సొంతం చేసుకున్న ప్రముఖ బ్యానర్ Thu, Apr 18, 2024, 07:16 PM
'కల్కి 2898 AD' గురించిన లేటెస్ట్ అప్డేట్ Thu, Apr 18, 2024, 07:14 PM