రజిని 'దర్బార్' నుంచి ఆ సీన్లు కట్!

by సూర్య | Sun, Jan 12, 2020, 07:05 PM

ఏఆర్‌ మురుగదాస్‌ దర్శకత్వం రజినీకాంత్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం దర్బార్.  దర్బార్ మూవీలో రజిని పోలీస్ అధికారి పాత్ర చేస్తున్నారు. ముంబై నేపథ్యంలో నడిచే మాఫియా యాక్షన్ ఎంటర్టైనర్ అని తెలుస్తుంది. నయనతార హీరోయిన్ గా నటిస్తుంది. సూపర్ స్టార్ రజని యాక్షన్ ఎంటర్టైనర్ దర్బార్ 9వ తేదీన విడుదలైంది. ఈ సినిమా మంచి టాక్ తెచ్చుకుని భారీ వసూళ్లను రాబడుతోంది. తెలుగులో రజిని మేనియా తగ్గలేదని దర్బార్ కలెక్షన్స్ నిరూపిస్తున్నాయి. చాలాకాలం తర్వాత పోలీస్‌ గెటప్‌లో కనిసిస్తుండటం, మురగదాస్‌ దర్శకత్వం వహిస్తుండటం, టీజర్‌, ట్రైలర్‌, పాటలు ఓ రెంజ్‌లో ఉండటంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అయితే ఈ భారీ అంచానల నడుమ విడుదలై ఈ సినిమాకు తొలి ఆట నుంచే పాజిటివ్‌ రెస్పాన్స్‌ వచ్చింది. అయితే ఈ మూవీలో కొన్ని కాంట్రవర్సీ డైలాగ్స్ ఉన్నాయని సినిమా రిలీజ్ రోజు తమిళ నాట ఓ వర్గం వారు పెద్ద ఎత్తున గొడవ చేశారు. సినిమాలోని జైలు సీన్లో 'డబ్బు ఉంటే జైలు నుంచి బయటికి వెళ్లి షాపింగ్ కూడా చేయొచ్చని ' డైలాగ్ పెద్ద దుమారం లేపింది. అయితే ఇది కేవలం వినోదం కోసమే పెట్టామని ఎవరిని ఉద్దేశించి కాదని నిర్మాతలు వివరణ ఇచ్చిన .. ఈ డైలాగు తమ నేత శశికళను ఉద్దేశించినది అని అన్నాడీఎంకే లోని ఓ వర్గం నిరసనకు దిగిన విషయం తెలిసిందే. అయితే ఈ వర్గం వారు చేసిన రచ్చ అంతా ఇంతా కాదు దాంతో నిర్మాతలు ఆ డైలాగ్ తీసి వేయక తప్పలేదు. వివాదాస్పదమైన సీన్లను కట్ చేశామని నిర్మాతలు ప్రకటించారు. మరోవైపు ఈ మూవీలో రజనీకాంత్ ఒక పోలీస్ ఆఫీసర్ అయివుండి ఆయన డ్రెస్సింగ్ స్టైల్ తాను రౌడీ అని చెప్పే మాటలు కూడా కేసులు నమోదయ్యాయి. నాలుగు రోజుల్లో ఓ పోలీస్ ఫిట్నెస్ నిరూపించుకోవడం పై పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. అయితే ఓ పోలీసు హిప్పి జుట్టు గడ్డం తో నటించడం ఇది పోలీసుల అవమానించే విషయం అని మాజీ రక్షణ అధికారి మైఖేల్ తూత్తుక్కుడి థర్డ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టులో పిటిషన్ వేశారు. ఇది 21న విచారణకు రానుంది. మరోవైపు ఇది కేవలం సినిమాను చూడాలని ఒక హీరో ఎవరినీ ఉద్దేశించి నటించరని రజనీ అభిమానులు అంటున్నారు. మొదటి నుంచి రక రకాల కాంట్రవర్సీలతో ఈ మూవీ రిలీజ్ అయిన విషయం తెలిసిందే

Latest News
 
'థగ్ లైఫ్' విడుదల అప్పుడేనా? Sat, Apr 20, 2024, 05:14 PM
'ఫ్యామిలీ స్టార్' డిజిటల్ ఎంట్రీపై లేటెస్ట్ బజ్ Sat, Apr 20, 2024, 05:12 PM
వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ తేదీని లాక్ చేసిన 'కేజీఎఫ్ 2' Sat, Apr 20, 2024, 05:03 PM
యూట్యూబ్ ట్రేండింగ్ లో 'మనమే' టీజర్ Sat, Apr 20, 2024, 04:59 PM
ప్రియదర్శి - నభా నటేష్ చిత్రానికి క్రేజీ టైటిల్ లాక్ Sat, Apr 20, 2024, 04:58 PM