బిగ్ బాస్ హౌస్ నటి పైన అత్యాచారయత్నం జరిగిందట!

by సూర్య | Sun, Jan 12, 2020, 05:10 PM

హిందీలో బిగ్ బాస్ సీజన్ 13 లో ఈ షోకు సల్మాన్ ఖాన్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు. బిగ్ బాస్ సీజన్ 13 విజయవంతంగా కొనసాగుతోంది. ఐతే బిగ్ బాస్ హౌస్ నటి ఆర్తి సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. చిన్నప్పుడు తనపై అత్యాచారయత్నం జరిగిందని.. తమ ఇంట్లో పనిచేసే వ్యక్తే ఈ పని చేశాడని తెలిపింది ఆర్తి. సినిమా ప్రమోషన్స్ కోసం సినీ యాక్టర్స్ బిగ్ బాస్ హౌస్‌కు వెళ్తుండడం తెలిసిందే. ఛపాక్ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా దీపికా పదుకొణె, విక్రమ్‌తో పాటు యాసిడ్ దాడి బాధితురాలు లక్ష్మీ అగర్వాల్ ఆదివారం బిగ్ బాస్ హౌస్‌కి వెళ్లారు. ఈ సందర్భంగా హౌస్ మేట్స్ ఒక్కొక్కరు తమ జీవితంలో ఎదుర్కొన్న చేదు అనుభవాలను పంచుకున్నారు. ఇక ఆర్తి సింగ్ చిన్నతనంలో తనపై జరిగిన అత్యాచారయత్నాన్ని గుర్తుచేసుకొని కన్నీటి పర్యంతమైంది. డిప్రెషన్ నుంచి బయటపడేందుకు తన తల్లి, సోదరుడు ఎంతో కృషి చేశారని చెప్పింది ఆర్తి సింగ్. ఆ భయం ఇంకా తనను వెంటాడుతోందని ఒంటరిగా పడుకోవాలంటే భయమని తెలిపింది. ఆ భయంతో ఇప్పటికీ గది తలుపు తెరుచుకొనే నిద్రపోతానని పేర్కొంది. మహిళలు తనపై జరిగే దాడుల గురించి నోరు విప్పాలని కోరింది ఆర్తి సింగ్.

Latest News
 
'తలైవర్ 171' టైటిల్ టీజర్ విడుదల ఎప్పుడంటే...! Thu, Mar 28, 2024, 08:24 PM
'గేమ్ ఛేంజర్' డిజిటల్ రైట్స్ ని సొంతం చేసుకున్న ప్రముఖ ప్లాట్ఫారం Thu, Mar 28, 2024, 08:21 PM
'శ్రీరంగనీతులు' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కి వెన్యూ లాక్ Thu, Mar 28, 2024, 08:19 PM
'శశివదనే' నుండి గోదారి అటువైపో సాంగ్ రిలీజ్ Thu, Mar 28, 2024, 08:17 PM
త్వరలో స్మాల్ స్క్రీన్ పై ఎంట్రీ ఇవ్వనున్న 'అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్' Thu, Mar 28, 2024, 08:15 PM