న్యూజిలాండ్‌లో ‘అల వైకుంఠపురములో' రికార్డ్!

by సూర్య | Sun, Jan 12, 2020, 03:34 PM

స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ దర్శకత్వంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా వస్తోన్న ‘అల వైకుంఠపురములో’.  భారీ అంచనాల నడుమ విడుదలైన ‘అల వైకుంఠపురములో’ చిత్రం భారీ వసూళ్లను రాబడుతోంది. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా విదేశాల్లో సైతం మంచి వసూళ్లను రాబడుతోంది. యూఎస్లో మంచి స్టార్ట్ అందుకున్న చిత్రం న్యూజిలాండ్‌లో అయితే రికార్డ్ స్థాయిలో ఓపెనింగ్స్ సాధించింది. మొత్తం మూడు లొకేషన్లలో వేసిన 5 షోల ద్వారా 34,625 డాలర్లను కలెక్ట్ చేసింది. ఒక తెలుగు చిత్రం ఇంత తక్కువ షోల ద్వారా ఇంత పెద్ద మొత్తం ఇదే మొదటిసారి. గతంలో ‘బాహుబలి 2’ చిత్రం ప్రీమియర్ల ద్వారా 21,290 డాలర్లను రాబట్టింది. ఒక రకంగా బన్నీ చిత్రం ఆల్ టైమ్ రికార్డ్ నెలకొల్పిందనే అనొచ్చు.

Latest News
 
'కుబేర' కీలక షెడ్యూల్‌ను పూర్తి చేసుకున్న రష్మిక Thu, Apr 25, 2024, 05:41 PM
షూటింగ్ పూర్తి చేసుకున్న నిహారిక తమిళ చిత్రం Thu, Apr 25, 2024, 05:38 PM
OTT : తెలుగు మరియు ఇతర భాషల్లో డిజిటల్‌ ఎంట్రీ ఇచ్చేసిన 'OMG 2' Thu, Apr 25, 2024, 05:36 PM
సుహాస్ తదుపరి విడుదలకు సాలార్ మేకర్స్ మద్దతు Thu, Apr 25, 2024, 05:34 PM
త్వరలో 'విదా ముయార్చి' ఫస్ట్ లుక్ విడుదల అనౌన్స్మెంట్ Thu, Apr 25, 2024, 04:16 PM