సరిలేరు నీకెవ్వరూ ప్రీమియర్ కలెక్షన్స్ 'అల వైకుంఠపురంలో' క్రాస్ చేసిందా ?

by సూర్య | Sun, Jan 12, 2020, 12:48 PM

సంక్రాంతి కానుకగా  మహేష్ సరిలేరు నీకెవ్వరూ , అల్లు అర్జున్ అల వైకుంఠపురం లో రెండు భారీ చిత్రాలు రిలీజ్ అయ్యాయి. జనవరి 11 న సరిలేరు రాగా.ఈరోజు అల చిత్రం వచ్చి పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. భారీ అంచనాల మధ్య ఈ రెండు చిత్రం రిలీజ్ అవ్వడం తో కలెక్షన్ల ఫై అంత అరా తీస్తున్నారు. ప్రస్తుతం అందుతున్న సమాచారం మేరకు అమెరికా లో సరిలేరు ప్రీమియర్ కలెక్షన్లను అల క్రాస్ చేసిందని తెలుస్తుంది. ఓవర్సీస్ లో మహేష్ బాబు నటించిన 'సరిలేరు నీకెవ్వరు' సినిమాకు తొలిరోజు కలెక్షన్లు 417,559 డాలర్లు రాబట్టగా.. 'అల వైకుంఠపురంలో' ప్రీమియర్‌కి 590,216 డాలర్ల వసూళ్లు వచ్చినట్లు సినీ విశ్లేషకుడు రమేష్ బాలా ట్విటర్ వేదికగా వెల్లడించారు. ఈ రకంగా చూసుకుంటే అమెరికాలో 'అల వైకుంఠపురంలో' ఓ రేంజ్‌లో దూసుకుపోతోందనే చెప్పాలి. అమెరికాలోనే కాదు న్యూజిల్యాండ్‌లో 'అల వైకుంఠపురంలో' రికార్డు క్రియేట్ చేసింది. అక్కడ మూడు ప్రదేశాల్లో విడుదలైన ఈ సినిమా ఐదు షోలకే 34,625 డాలర్లు వసూలు చేసింది. ఇప్పటివరకు ఏ తెలుగు సినిమాకు ఈ స్థాయిలో వసూళ్లు రాలేదని రమేష్ బాలా చెప్పుకొచ్చారు.

Latest News
 
'తలైవర్ 171' టైటిల్ టీజర్ విడుదల ఎప్పుడంటే...! Thu, Mar 28, 2024, 08:24 PM
'గేమ్ ఛేంజర్' డిజిటల్ రైట్స్ ని సొంతం చేసుకున్న ప్రముఖ ప్లాట్ఫారం Thu, Mar 28, 2024, 08:21 PM
'శ్రీరంగనీతులు' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కి వెన్యూ లాక్ Thu, Mar 28, 2024, 08:19 PM
'శశివదనే' నుండి గోదారి అటువైపో సాంగ్ రిలీజ్ Thu, Mar 28, 2024, 08:17 PM
త్వరలో స్మాల్ స్క్రీన్ పై ఎంట్రీ ఇవ్వనున్న 'అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్' Thu, Mar 28, 2024, 08:15 PM