యూఎస్ బాక్సాఫీస్ కింగ్ గా మహేష్ !

by సూర్య | Sun, Jan 12, 2020, 12:26 PM

దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా వస్తోన్న  ‘సరిలేరు నీకెవ్వరు’  నిన్న విడుదలైంది.  ఈ చిత్రాన్ని దిల్ రాజు, అనిల్ సుంకర సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మహేష్ ఆర్మీ అధికారిగా కనిపించనున్న ఈ చిత్రంలో యాక్షన్, ఎంటెర్టైన్మెంట్, సోషల్ మెసేజ్ అన్నీ ఉంటాయట. ఇందులో మహేష్ బాబు సరసన రష్మిక మందన్న కథానాయికగా నటించగా విజయశాంతి ఒక కీలక పాత్రలో కనిపించనున్నారు. అదిరిపోయే రేంజులో ఈ సినిమా కలెక్షన్స్ తీసుకుంది. మహేష్ సరిలేరు నీకెవ్వరు మొదటిరోజు రికార్డు వసూళ్లు సాధించింది. చాలా ఏరియాలలో మహేష్ కెరీర్ బెస్ట్ మరియు నాన్ బాహుబలి రికార్డ్స్ నమోదయ్యాయి. యూఎస్ బాక్సాఫీస్ కింగ్ గా మహేష్ ఓ అరుదైన ఫీట్ ని సొంతం చేసుకున్నాడు. సరిలేరు నీకెవ్వరు ప్రీమియర్స్ తో కలిపి మొదటిరోజే 1 మిలియన్ వసూళ్లను దాటి వేసింది. సరిలేరు నీకెవ్వరు చిత్రంతో మహేష్ 10 సార్లు యూఎస్ బాక్సాపీస్ వద్ద వన్ మిలియన్ సాధించిన హీరోగా నిలిచాడు. సౌత్ ఇండియా లోనే పది సార్లు వన్ మిలియన్ సాధించిన హీరోలు లేరు. యూఎస్ మార్కెట్ లో బారి డిమాండ్ కలిగిన మహేష్ ఆ అరుదైన రికార్డు సొంతం చేసుకున్నాడు. సరిలేరు నీకెవ్వరు తెలుగు రాష్ట్రాలలో కూడా వసూళ్ల జోరు కొనసాగిస్తోంది. 

Latest News
 
'ప్రేమలు' సినిమాకి సీక్వెల్ రెడీ Fri, Apr 19, 2024, 11:34 PM
మెగాస్టార్​ చిరంజీవితో రష్యా ప్రతినిధుల సమావేశం Fri, Apr 19, 2024, 08:54 PM
100M స్ట్రీమింగ్ నిమిషాలను క్రాస్ చేసిన 'గామి' Fri, Apr 19, 2024, 08:23 PM
'భజే వాయు వేగం' టీజర్ విడుదలకి టైమ్ లాక్ Fri, Apr 19, 2024, 08:21 PM
విజయ్ దేవరకొండ స్పై థ్రిల్లర్‌పై తాజా అప్డేట్ Fri, Apr 19, 2024, 07:58 PM