విజయ్ దేవరకొండ ఇచ్చిన గిఫ్ట్ కి బన్నీ ఫిదా!

by సూర్య | Sat, Jan 11, 2020, 03:43 PM

స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ దర్శకత్వంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా వస్తోన్న ‘అల వైకుంఠపురములో’. ప్రతి పాటకు ముందు టీజర్ మరియు దానికొక ప్రత్యేక అనౌన్సమెంట్ ఇలా వరుస అప్డేట్స్ తో సినిమా జనాలలో ఉండేలా చేశారు. తాజాగా ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ అయింది.  త్రివిక్రమ్ మార్క్ డైలాగ్స్ అండ్ టైమింగ్, బన్నీ శైలి మ్యానరిజమ్స్ అండ్ స్టైల్ ట్రైలర్ లో హైలైట్ గా నిలిచాయి. ఇక అల వైకుంఠపురంలో మూవీ రేపు ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల కానుంది.  అయితే విజయ్ దేవరకొండ తన బహుమతితో  అల్లు అర్జున్ ని ఫిదా చేశారు. ఆ బహుమతికి స్పందనగా బన్నీ ట్విట్టర్ వేదికగా సంతోషం వ్యక్తం చేశారు. విషయంలోకి వెళితే విజయ్ దేవరకొండ రౌడీ బ్రాండ్ పేరుతో బట్టల వ్యాపారం చేస్తున్న సంగతి తెలిసిందే. ఆ రౌడీ బ్రాండ్ కి సంబంధించి బట్టలు బన్నీకి బహుమతిగా పంపించారు. ఆ బహుమతి అందుకున్న బన్నీ… ‘చెప్పిన విధంగా నూతన దుస్తులు పంపినందుకు ధన్యవాదాలు మై డియర్ బ్రదర్, రేపు అల వైకుంఠపురంలో విజయోత్సవ వేడుకలో నేను ఈ బట్టలే వేసుకుంటాను’ అని ట్వీట్ చేశారు. 






 

Latest News
 
'ప్రేమలు' సినిమాకి సీక్వెల్ రెడీ Fri, Apr 19, 2024, 11:34 PM
మెగాస్టార్​ చిరంజీవితో రష్యా ప్రతినిధుల సమావేశం Fri, Apr 19, 2024, 08:54 PM
100M స్ట్రీమింగ్ నిమిషాలను క్రాస్ చేసిన 'గామి' Fri, Apr 19, 2024, 08:23 PM
'భజే వాయు వేగం' టీజర్ విడుదలకి టైమ్ లాక్ Fri, Apr 19, 2024, 08:21 PM
విజయ్ దేవరకొండ స్పై థ్రిల్లర్‌పై తాజా అప్డేట్ Fri, Apr 19, 2024, 07:58 PM