నా బాయ్‌ఫ్రెండ్ గురించి నా భర్త కి తెలుసు: కాజోల్

by సూర్య | Sat, Jan 11, 2020, 02:44 PM

అజయ్ దేవ్‌గణ్, కాజోల్ కలిసి తాజాగా నటించిన చిత్రం 'తానాజీ'. నిన్న విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర అదరగొడుతోంది. ఈ సినిమాలో కాజోల్ తన భర్త అజయ్ దేవ్‌గన్‌తో చాలా రోజుల తర్వాత కలిసి నటించింది. ఈ సినిమాను అజయ్ దేవగన్ నిర్మిస్తూ.. సినిమాలో ప్రధాన పాత్ర పోషించాడు. మిగితా పాత్రల్లో సైఫ్‌ అలీ ఖాన్‌, కాజోల్‌, శరద్‌ కేల్కర్‌, జగపతిబాబు, శశాంక్‌ షిండే, నేహా శర్మ నటించారు. కాగా  చిత్ర ప్రమోషన్‌లో భాగంగా కాజోల్ ఇటీవల మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆమె తన మాజీ బాయ్‌ఫ్రెండ్ గురించి కొన్ని ఆసక్తకర వ్యాఖ్యలు చేశారు. ఆమె మాట్లాడుతూ.. తనకు పెళ్లికి ముందు ఓ బాయ్‌ఫ్రెండ్ ఉండేవాడని, కొంత కాలం అతనితో స్నేహం చేశానని చెప్పింది. అంతేకాదు ఈ తన మాజీ బాయ్ ఫ్రెండ్ గురించి తన భర్త అజయ్‌కు కూడా తెలియజేశానని పేర్కోంది. 'అజయ్‌తో పరిచయానికి ముందే నాకొక బాయ్‌ఫ్రెండ్ ఉండేవాడు. కానీ, అతనితో ఎక్కువ రోజులు స్నేహం చేయలేదు. కారణం కొన్ని విషయాల్లో మా మధ్య మనస్పర్థలు వచ్చాయి. ఈ విషయం గురించి అజయ్‌కు చెప్పాను. ఆ తర్వాత నేను, అజయ్ నాలుగేళ్లు డేటింగ్ చేశాం. ఆ తర్వాతే మేం పెళ్లి చేసుకున్నాం అని కాజోల్ పేర్కోంది.

Latest News
 
'సాలార్' వరల్డ్ వైడ్ క్లోజింగ్ కలెక్షన్స్ Thu, Mar 28, 2024, 07:52 PM
యూట్యూబ్ ట్రేండింగ్ లో 'ఫ్యామిలీ స్టార్' ట్రైలర్ Thu, Mar 28, 2024, 07:50 PM
శాటిలైట్ పార్టనర్ ని లాక్ చేసిన 'గేమ్ ఛేంజర్' Thu, Mar 28, 2024, 07:48 PM
రేపు స్ట్రీమింగ్ కి అందుబాటులోకి రానున్న 'ఇన్‌స్పెక్టర్ రిషి' Thu, Mar 28, 2024, 07:45 PM
$200K మార్క్ ని చేరుకున్న 'టిల్లు స్క్వేర్' USA ప్రీమియర్స్ ప్రీ-సేల్స్ Thu, Mar 28, 2024, 07:32 PM