‘ఎంత మంచివాడవురా' మూవీ స్టోరీ ఇదేనా?

by సూర్య | Sat, Jan 11, 2020, 01:15 PM

సతీశ్ వేగేశ్న దర్శకత్వంలో నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా రూపొందిన చిత్రం ‘ఎంత మంచివాడవురా’. ఈ చిత్రాన్ని జనవరి 15న విడుదల చేయాలని చాన్నాళ్ల క్రితమే భావించిన నిర్మాతలు పెద్ద సినిమాల పోటీ ఉన్నా వెనక్కి తగ్గకుండా అదే రోజున చిత్రాన్ని విడుదల చేయనున్నారు. కాగా తాజాగా ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్ రిలీజ్ అయింది. ట్రైలర్ లో హీరో క్యారెక్టర్ ను బాగా ఎలివేట్ చేశారు. అలాగే ఎమోషన్, యాక్షన్ అండ్ కామెడీను కూడా బాగా చూపించారు. ముఖ్యంగా ఎమోషనల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ కు యాక్షన్ కూడా జోడించి ‘ఎంత మంచివాడవురా’ను ఆల్ ఎమోషన్స్ తో పక్కా కమర్షియల్ ఎంటర్ టైనర్ గా తీర్చదిద్దిన్నట్లు ఈ ట్రైలర్ చూస్తే అర్ధమవుతుంది. ఇక రాముడు మంచి వాడే.. కానీ రావణ సూరుడిని వేసేయలే.. అనే డైలాగ్‌ను బట్టి ఈ సినిమా పాయింట్ ఏంటో చెప్పకనే చెప్పేసింది చిత్రబృందం. ఇదిలా ఉండగా కళ్యాణ్ రామ్ తాజాగా ప్రముఖ హీరో మరియు కమెడియన్ అలీ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న షో. ఆలీతో సరదాగా లో పాల్గొని ఈ చిత్రం గురించి మూడు ముక్కల్లోచెప్పాడు. అదేమంటే తమ తోటి వారికి అవసరమైన సహాయం చేస్తే అంతే చాలనే ట్యాగ్ లైన్ తో స్టోరీ మొత్తం తిరుగుతున్నట్లు పేర్కొన్నారు.. ఇకపోతే సంక్రాంతి కానుకగా ఈ చిత్రం ఈ నెల 15వ తారీఖున విడుదల కాబోతోంది. ఈ ఇందులో కళ్యాణ్ రామ్ సరసన మెహ్రిన్ పిర్జాడ నటించగా సీనియర్ నటుడు విజయ్ కుమార్, నరేష్, తనికెళ్ల భరణి వంటి వారు ప్రధాన పాత్రలు పోషించారు.

Latest News
 
'ప్రేమలు' సినిమాకి సీక్వెల్ రెడీ Fri, Apr 19, 2024, 11:34 PM
మెగాస్టార్​ చిరంజీవితో రష్యా ప్రతినిధుల సమావేశం Fri, Apr 19, 2024, 08:54 PM
100M స్ట్రీమింగ్ నిమిషాలను క్రాస్ చేసిన 'గామి' Fri, Apr 19, 2024, 08:23 PM
'భజే వాయు వేగం' టీజర్ విడుదలకి టైమ్ లాక్ Fri, Apr 19, 2024, 08:21 PM
విజయ్ దేవరకొండ స్పై థ్రిల్లర్‌పై తాజా అప్డేట్ Fri, Apr 19, 2024, 07:58 PM