జోరు పెంచిన సమంత !

by సూర్య | Sat, Jan 11, 2020, 01:01 PM

సమంత తాజాగా జాను సినిమాలోనూ ఎప్పటికి గుర్తుండిపోయే టైటిల్ రోల్ పోషిస్తుంది. తమిళనాట బ్లాక్ బస్టర్ హిట్ అయ్యి.. ఎన్నో అవార్డ్స్ ని గెలుచుకున్న 96 ని తెలుగులో సమంత - శర్వానంద్ లు జంటగా జాను అనే టైటిల్ తో తెలుగు ప్రేక్షకులముందుకు రాబోతుంది. తమిళనాట త్రిష పోషించిన రోల్ ని తెలుగులో సమంత చేస్తుంది. త్రిష 96 రీమేక్ లో నటించలేదు జీవించింది. ఇక సమంత కూడా జాను పాత్రతో నటించడం లేదు. జీవించినట్లే కనబడుతుంది. మరి మరోసారి జాను గా సమంత కెరీర్ బెస్ట్ పెరఫార్మెన్స్ ఇవ్వడం ఖాయమే. మరి ఈ సినిమా కూడా హిట్ కొట్టిందా సమంత ఎవరికీ అందనంత ఎత్తులో కూర్చుంటుంది. ఎలాగూ అమెజాన్ వెబ్ సీరీస్ లో ఫ్యామిలీ మ్యాన్ లో నెగెటివ్ రోల్ క్లిక్ అవడం ఖాయమే గనక సమంత కి కావాల్సిన ఇంపార్టెన్స్ పాత్రలన్నీ ఆమె కాళ్ళ దగ్గరకు వచ్చిపడతాయి. పెళ్లి తర్వాత హీరోయిన్స్ చాలామంది వెండితెరకు దాదాపుగా దూరమవుతారు. కేవలం క్రేజ్ మీదే హీరోయిన్ జీవితం నడుస్తుంది. ఇక కాజల్, తమన్నా లాంటోళ్ళు ఇప్పటికి కమర్షిల్ చిత్రాలు వెంట పరుగులుపెడుతుంటే. సమంత మాత్రం ప్రాధాన్యత గల పాత్రలతో దూసుకుపోతుంది. కథ నచ్చితే నెగెటివ్ షేడ్స్ అయినా కాదనని సమంత పెళ్లి తర్వాత హిట్స్ మీదే నడుస్తుంది. ఎవ్వరికి సాధ్యం కానీ పనిని సుసాధ్యం చేస్తూ కెరీర్ ని చక్కదిద్దుకుంటున్న సమంత యూటర్న్ లో విభిన్నంగా కనిపిచింది. ఇక ఓ బేబీ లో ఓ రేంజ్ నటనతో ఆకట్టుకుంది.

Latest News
 
రూ.50 లక్షలు విరాళం అందించిన హీరో శివకార్తికేయన్ Tue, Apr 23, 2024, 10:07 PM
3డిలో రానున్న 'జై హనుమాన్' మూవీ Tue, Apr 23, 2024, 08:57 PM
'భజే వాయు వేగం' టీజర్ కి భారీ స్పందన Tue, Apr 23, 2024, 07:42 PM
'పుష్ప 2' ఫస్ట్ సింగల్ విడుదల అప్పుడేనా? Tue, Apr 23, 2024, 07:33 PM
శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న 'శర్వా 36' Tue, Apr 23, 2024, 07:30 PM