లారీ డ్రైవర్‌ గా అల్లు అర్జున్?

by సూర్య | Sat, Jan 11, 2020, 12:48 PM

 సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ ఒక  సినిమా చేస్తోన్న విషయం తెలిసిందే. కాగా ఇప్పటికే ఈ చిత్రం ఫస్ట్ షెడ్యూల్ కూడా పూర్తయింది. ఐతే తాజాగా ఈ సినిమాలో బన్నీ రోల్ గురించి ఓ ఇంట్రస్టింగ్ అప్ డేట్ తెలిసింది. బన్నీ రఫ్ లుక్ లో ఒక లారీ డ్రైవర్‌ గా ఈ సినిమాలో నటించబోతున్నట్లు ఫిల్మ్ నగర్ లో వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఈ వార్తలో ఎంత నిజం ఉందో చూడాలి. ఇక ఈ కథ ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో జరుగుతుండటం కారణంగా సినిమాలో చాల క్యారెక్టర్స్ ఉంటాయని.. ఆ క్యారెక్టర్స్ లో కొత్తవారు అయితేనే బాగుంటుందని సుకుమార్ కొంతమంది కొత్త నటీనటులను ఈ సినిమా కోసం తీసుకున్నాడు. ఈ సినిమా రివెంజ్ ఫార్ములాతోనే తెరకెక్కబోతుందని తెలుస్తోంది. గతంలో కూడా సుకుమార్ ‘వన్ నేనొక్కడినే, నాన్నకు ప్రేమతో’ చిత్రాలను కూడా రివెంజ్ ఫార్ములాతోనే తీశారు. ఇప్పుడు కూడా బన్నీతో చేయబోయే సినిమా కూడా రివెంజ్ స్టోరీతోనే చేస్తున్నాడు

Latest News
 
సంజయ్‌ లీలా భన్సాలీ దర్శకత్వంలో నయనతార ? Fri, Apr 19, 2024, 11:19 AM
సరికొత్త హర్రర్ మిస్టరీ మూవీతో రాబోతున్న బెల్లంకొండ శ్రీనివాస్ Fri, Apr 19, 2024, 10:20 AM
కన్నప్పలో కాజల్? Fri, Apr 19, 2024, 10:19 AM
ప్రముఖ మలయాళ కథా రచయిత బలరామ్ కన్నుమూత Thu, Apr 18, 2024, 10:06 PM
కబీర్ సింగ్ సినిమాలో మిమ్మల్ని తీసుకున్నందుకు బాధపడుతున్నాను : సందీప్ రెడ్డి Thu, Apr 18, 2024, 10:01 PM