షూటింగ్ లో హీరోకి గాయం

by సూర్య | Sat, Jan 11, 2020, 12:32 PM

 గత ఏడాది విడుదలైన జెర్సీ ఫీల్ గుడ్ ఎమోషనల్ ఎంటరైనర్ గా నిలిచింది. ఈ సినిమా నాని కెరీర్ లో బెస్ట్ మూవీగా జెర్సీ నిలిచిపోయేంతగా ఆయన నటన కనబరిచారు. పెళ్ళైన స్ట్రగులింగ్ క్రికెటర్ గా నాని చాలా బాగా నటించారు. కాగా ఈ చిత్రం హిందీలో రీమేక్ అవుతుంది. షాహిద్ కపూర్ హీరోగా తెలుగు జెర్సీ తెరకెక్కించిన దర్శకుడు గౌతమ్ తిన్ననూరి ఈ చిత్రానికి కూడా దర్శకత్వం వహిస్తున్నారు. కాగా ఈ చిత్ర షూటింగ్ సమయంలో షాహిద్ ప్రమాదానికి గురయ్యారు. షూటింగ్ భాగంగా షాహిద్ కపూర్ క్రికెట్ ఆడుతున్నపుడు బంతి ఊహించని విధంగా వచ్చి ముఖానికి తగిలి దిగువ పెదవిపై తీవ్ర గాయమైంది. షాహిద్ కపూర్ పెదవి చిట్లి రక్తం రావడంతో అతన్ని వెంటనే ఆసుపత్రికి తరలించారు. డాక్టరు అతని పెదవికి కుట్లు వేశారు. పెదవిపై అయిన గాయం నయం అవడంతోపాటు వాపు తగ్గే వరకూ నాలుగైదు రోజులు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు షాహిద్‌కు సూచించారు. దీంతో ఈ సినిమా షూటింగును ఐదు రోజుల పాటు నిలిపివేశారు.

Latest News
 
వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ తేదీని లాక్ చేసిన 'భీమ్లా నాయక్' Thu, Mar 28, 2024, 02:43 PM
గేమ్ ఛేంజర్ : జరగండి సాంగ్ బడ్జెట్ ఎంతంటే....! Thu, Mar 28, 2024, 02:41 PM
రేపు థియేటర్స్ లో సందడి చేయనున్న 'కలియుగం పట్టణంలో' Thu, Mar 28, 2024, 02:34 PM
'మనమే' నుండి ఫస్ట్ సింగల్ అవుట్ Thu, Mar 28, 2024, 02:32 PM
నేడే 'ఫైటర్‌రాజా' టీజర్‌ లాంచ్ Thu, Mar 28, 2024, 02:30 PM