నాన్ బాహుబలి రికార్డుపై కన్నేసిన 'సరిలేరు నీకెవ్వరూ'..!

by సూర్య | Fri, Jan 10, 2020, 07:44 PM

కొన్ని సినిమాల్లో అబ్బురపరిచే యాక్షన్ ఉంటుంది. కొన్ని సినిమాలలో కడుపుబ్బా నవ్వుకునే కామెడీ ఉంటుంది. ఇక మరికొన్ని సినిమాలలో కన్నీరు పెట్టించే సెంటిమెంట్ ఉంటుంది. వీటిలో ఎదో ఒక జోనర్ ని మెయిన్ లైన్ గా తీసుకొని దానిమీద సినిమాను తీసి సక్సెస్ కొడుతుంటారు దర్శకులు. కమర్షియల్ ఎలిమెంట్స్ అన్నీ కలిపి ఒక సినిమా వస్తే.. ఆ సినిమా ఎంత పెద్ద హిట్ అవుతుందో వేరే చెప్పనవసరం లేదు. అలా నవరసాలు కలగలిసిన చిత్రమే 'సరిలేరు నీకెవ్వరూ'. ట్రైలర్, టీజర్ లలో సినిమాలోని కమర్షియల్ ఎలిమెంట్స్ ని కొద్దికొద్దిగా చూపిస్తూ సినిమాపై హైప్ కి క్రియేట్ చేసింది చిత్ర యూనిట్. ఈ సినిమాని యూత్, ఫ్యామిలీ కలిసి చూడొచ్చు.. ఇందులో అన్ని రకాల ఎమోషన్స్, ఎలిమెంట్స్ ఉంటయాని చిత్ర యూనిట్ ఎన్నో ఇంటర్ట్వ్యూలలో చెపుతూనే వుంది. మహేష్ కామెడీ టైమింగ్ వేరే రేంజ్ లో ఉంటుందని, ట్రైన్ కామెడీ సినిమాకే హైలెట్ గా నిలుస్తుందని, ఇంటర్వెల్ సీక్వెన్స్ అందరిని ఆలోచనలో పడేస్తుందని సక్సెస్ మంత్ర అనీల్ రావిపూడి చాలా కాన్ఫిడెంట్ గా చెపుతున్నాడు. ఇక విజయశాంతి - మహేష్ బాబు మధ్య వచ్చే సన్నివేశాలు రోమాలు నిక్కబొడుచుకునేలా వుంటాయని కూడా చెపుతున్నారు. ఇలా ఎన్నో ఈ సినిమాలో ఉండడంతో సరిలేరు నీకెవ్వరూ సినిమాపై భారీ హైప్ క్రియేట్ అయింది. ఈ సినిమాకి కొంచెం హిట్ టాక్ వచ్చినా నాన్ బాహుబలి రికార్డులను కూడా కొల్లగొట్టే అవకాశం ఉందని అభిమానులు ఆతృతగా వున్నారు.

Latest News
 
'ప్రేమలు' సినిమాకి సీక్వెల్ రెడీ Fri, Apr 19, 2024, 11:34 PM
మెగాస్టార్​ చిరంజీవితో రష్యా ప్రతినిధుల సమావేశం Fri, Apr 19, 2024, 08:54 PM
100M స్ట్రీమింగ్ నిమిషాలను క్రాస్ చేసిన 'గామి' Fri, Apr 19, 2024, 08:23 PM
'భజే వాయు వేగం' టీజర్ విడుదలకి టైమ్ లాక్ Fri, Apr 19, 2024, 08:21 PM
విజయ్ దేవరకొండ స్పై థ్రిల్లర్‌పై తాజా అప్డేట్ Fri, Apr 19, 2024, 07:58 PM