మురుగదాస్ పై నయన్ ఫైర్ అవ్వడం న్యాయమేనా?

by సూర్య | Fri, Jan 10, 2020, 05:49 PM

రజినీకాంత్ కి జోడిగా నయనతార నటిస్తుంటే.. సినిమాపై ఎక్కడలేని అంచనాలు వచ్చేసాయి. ఎందుకంటే రజినీకాంత్ హీరోస్ లో నెంబర్ వన్ అయితే.. హీరోయిన్స్ లిస్ట్ లో నయనతారే నెంబర్ వన్. కాబట్టి నయనతార పాత్రపై దర్బార్ విషయంలో గట్టి అంచనాలు వచ్చేసాయి. తీరా సినిమా చూసాక ఈమాత్రం దానికా నయన్, మురుగదాస్ మీద అప్పట్లో అంతలా ఫైర్ అయ్యింది అంటున్నారు. అంటే దర్బార్ సినిమాలో ఏమాత్రం ప్రాధాన్యం లేని పాత్ర చేసింది నయనతార. జస్ట్ హీరోయిన్ ట్రాక్ ఉండాలి అంటే ఉండాలిగా అన్నట్టుగా మురుగదాస్ ఓ ట్రాక్ పెట్టి... అందులో నయనతారని తీసుకున్నాడు. తీరా నయనతార లుక్స్, గ్లామర్ పరంగా బావున్నప్పటికీ.. ఆమె పాత్రకీ అంతగా స్కోప్ లేదు. నయనతార రజినీకాంత్ పక్కన అలంకారంగా మాత్రం ఉపయోగపడింది. ప్రస్తుతం భారీ క్రేజ్ ఉన్న నయనతార తన స్థాయికి తగ్గ పాత్ర చేయలేదిందులో అనిపిస్తుంది.

Latest News
 
సూర్య కొత్త సినిమాపై అప్‌డేట్ Fri, Mar 29, 2024, 02:24 PM
లాంగ్ బ్లాక్ గౌన్ లో బుట్టబొమ్మలా రష్మీ Fri, Mar 29, 2024, 01:44 PM
మూవీ రివ్యూ: “టిల్లు స్క్వేర్” Fri, Mar 29, 2024, 12:45 PM
నేడు విడుదలకి సిద్ధమైన ‘గాడ్జిల్లా అండ్‌ కాంగ్‌’ Fri, Mar 29, 2024, 12:03 PM
ఏప్రిల్ 22న టైటిల్ చెబుతాం Fri, Mar 29, 2024, 12:01 PM