బాలీవుడ్ బ్యూటీ దీపికాకు జేఎన్‌యూ కష్టాలు

by సూర్య | Fri, Jan 10, 2020, 02:01 PM

బాలీవుడ్ బ్యూటీ క్వీన్ దీపికా పదుకోణెకు జేఎన్‌యూ కష్టాలు వచ్చిపడ్డాయి. జేఎన్‌యూలో దుండగుల దాడిలో గాయాలపాలైన విద్యార్థులను పరామర్శించిన దీపికా పదుకోణెపై కేంద్రం కన్నెర్ర చేసింది. దీపికా నటించిన ఛపాక్ సినిమా త్వరలో విడుదల కాబోతుంది. ఈ మూవీకి సంబంధించి ఓ ప్రమోషనల్ వీడియాను చిత్ర యూనిట్ షూట్ చేసింది. అయితే ఈ ప్రమోషనల్ వీడియోను కేంద్ర నైపుణ్య అభవృద్ధి మంత్రిత్వ శాఖ నిలిపివేసింది. దివ్యాంగులతో పాటు యాసిడ్ బాధితుల్లో స్పూర్తి నింపేదుకు ఈ వీడియోను విడుదల చేయాలని బాలీవుడ్ అందాల భామ భావించింది. కానీ కేంద్రం మాత్రం బ్రేకులు వేసింది. యాసిడ్ దాడికి గురైన యువతి జీవిత కథ ఆధారంగా దీపికా పదుకోణె హిరోయిన్ కమ్ నిర్మాతగా ఛపాక్ మూవీని నిర్మించింది. అయితే జేఎన్‌యూకు వెళ్లి విద్యార్థులకు సంఘీభావం ప్రకటించిన దీపికా నెటిజన్లకు కూడ టార్గెట్ అయింది. ఛపాక్ సినిమాను బహిష్కరించాలని సోషల్ మీడియాలో తీవ్ర స్థాయిలో నెటిజన్లు మండిపడుతున్నారు. ఇక ఛపాక్ మూవీని నిలిపివేయాలని యాసిడ్ బాధితురాలి లాయర్ కోర్టును ఆశ్రయించారు. అయితే మొన్నటి వరకు కేంద్రానికి దేశభక్తురాలిగా కనిపించిన దీపికా పదుకోణె.. జేఎన్‌యూను సందర్శించగానే దేశద్రోహురాలిగా మారిపోయిందా అంటూ కన్హయ్య కుమార్ ఎద్దేవా చేశారు.

Latest News
 
ఫరియా అబ్దుల్లా కాలుపై ఉన్న టాటూ అర్ధం ఏంటో తెలుసా? Tue, Apr 23, 2024, 10:37 AM
36 గంటల పాటు అభిమాని శ్రమ...10 వేల పదాలతో దళపతి విజయ్‌పై కవిత Mon, Apr 22, 2024, 10:51 PM
ఈ సారి ‘కూలీ'గా రాబోతున్న రజనీకాంత్‌ Mon, Apr 22, 2024, 09:10 PM
20 భాషలలో డిజిటల్ ఎంట్రీ ఇవ్వనున్న 'కంగువ' Mon, Apr 22, 2024, 08:45 PM
'మిరాయి' చిత్రం గురించిన లేటెస్ట్ అప్డేట్ Mon, Apr 22, 2024, 08:43 PM