'చపాక్' మూవీ రివ్యూ

by సూర్య | Fri, Jan 10, 2020, 01:02 PM

యాసిడ్ బాధితురాలు లక్ష్మి అగర్వాల్ బయోపిక్ చపాక్ లో నటించడమే కాదు.. ఆ సినిమాని నిర్మించింది కూడా బాలీవుడ్ టాప్ హీరోయిన్ దీపికా పదుకొనే. చిన్న చిన్న వివాదాల మధ్యన ప్రేక్షకుల ముందుకు వచ్చిన చపాక్ సినిమాపై మంచి అంచనాలే ఉన్నాయి. అయితే ఈ సినిమాలో దీపికా పదుకొనే యాసిడ్ బాధిత మహిళగా నటించింది. చపాక్ ప్రమోషన్స్ కూడా వినూత్న పద్దతిలో నిర్వహించిన దీపికా పదుకొనే కి చపాక్ సినిమా హిట్ అందించేలా కనబడుతుంది. తాజాగా విడుదలైన చపాక్ కథలోకి వెళితే.... జీవితంలో చదువు... గాయని కావాలనే కోరికతో... ఆనందంగా గడిపేస్తున్న మాలతి(దీపికా) మీద యాసిడ్ దాడి జరగడంతో.. ఆమె కలలన్ని ఒక్కసారిగా కల్లలుగా మరిపోతాయి. చాల దుఃఖం తో ఉన్న మాలతికి జర్నలిస్ట్ అమోల్ అనే యువకుడు పరిచయమవుతాడు. అమోల్ యాసిడ్ బాధితులకు వైద్యం అందిస్తూ ఓ స్వచ్ఛంద సంస్థని నడుపుతాడు. ఆ స్వచంద సంస్థలో చేరిన మాలతి న్యాయ పోరాటం ప్రారంభిస్తుంది. మరి యాసిడ్ దాడితో మాలతి ఎదుర్కున్న పరిణామాలు..? ఆమె చేసిన న్యాయపోరాటానికి ఎంత మేరకు మద్దతు లభించింది..? ఆమెకి న్యాయం జరిగిందా? అనేది పూర్తి కథ. అయితే మాలతి గా యాసిడ్ బాధితురాలిగా దీపికా పదుకొనే ఆమె పాత్రకి 100 శాతం న్యాయం చేసింది. అందమైన దీపికను ఆలా యాసిడ్ దాడితో మొహం కాలిపోవడమనేది ఆమె ఫాన్స్ జీర్ణించుకోలేరు. కానీ దీపికా మాత్రం ఆ పాత్రలో జీవించింది. ఇక మొహం యాసిడ్ తో కాలిపోయాక అద్దంలో చూసుకుని బాధపడుతున్న దీపికాని.. చూసిన ప్రతి ప్రేక్షకుడు కన్నీటి పర్యంతమవుతాడు. వాడు నా మొహాన్ని కాల్చాడు కానీ.. నా మనసును కాల్చలేదు అనే డైలాగ్ ఎమోషనల్ గా ఆకట్టుకుంటుంది. ఇక జర్నలిస్ట్ గా విక్రాంత్ మెస్సి మెప్పిస్తాడు. అయితే సినిమా మొత్తం దర్శకురాలు మేఘన గుల్జార్.. అమ్మాయిలు అన్యాయాలకు బలైనప్పుడు.. వారిలో ఉండే ఆత్మవిశ్వాసం, స్ఫూర్తి ఇతర మహిళకు అర్ధమయ్యే రీతిలో ఈ సినిమాని తెరకేకించింది. ఫస్ట్ హాఫ్ మొత్తం అందమైన అమ్మాయి మీద యాసిడ్ దాడి.. దాని వలన ఆ అమ్మాయి పడిన కష్టాలను చూపించిన దర్శకురాలు.. సెకండ్ హాఫ్ లో ఆ బాధితురాలి పోరాటాన్ని, సమాజంలో ఆమె ఎదుర్కున్న సూటి పోటీ మాటలను అన్నిటిని కళ్ళకు కట్టినట్టుగా ఎమోషనల్ గా తెరకెక్కించింది. ఇక సినిమాలో దీపికా నటన హైలెట్, అలాగే ఎమోషనల్ సన్నివేశాలు, సమాజానికి ఓ మెస్సేజ్ లా ఆకట్టుకునేలా ఉంటే.... సెకండ్ హాఫ్ లో సాగదీత సన్నివేశాలు కాస్త ఇబ్బంది పెట్టాయి.

Latest News
 
సూర్య కొత్త సినిమాపై అప్‌డేట్ Fri, Mar 29, 2024, 02:24 PM
లాంగ్ బ్లాక్ గౌన్ లో బుట్టబొమ్మలా రష్మీ Fri, Mar 29, 2024, 01:44 PM
మూవీ రివ్యూ: “టిల్లు స్క్వేర్” Fri, Mar 29, 2024, 12:45 PM
నేడు విడుదలకి సిద్ధమైన ‘గాడ్జిల్లా అండ్‌ కాంగ్‌’ Fri, Mar 29, 2024, 12:03 PM
ఏప్రిల్ 22న టైటిల్ చెబుతాం Fri, Mar 29, 2024, 12:01 PM