‘అల వైకుంఠపురములో’ ఏర్పాట్లు అద్దరగొడుతున్న బన్నీ కేరళ ఫ్యాన్స్!

by సూర్య | Fri, Jan 10, 2020, 12:55 PM

స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ దర్శకత్వంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా వస్తోన్న ‘అల వైకుంఠపురములో’. ప్రతి పాటకు ముందు టీజర్ మరియు దానికొక ప్రత్యేక అనౌన్సమెంట్ ఇలా వరుస అప్డేట్స్ తో సినిమా జనాలలో ఉండేలా చేశారు. తాజాగా ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ అయింది. ది. త్రివిక్రమ్ మార్క్ డైలాగ్స్ అండ్ టైమింగ్, బన్నీ శైలి మ్యానరిజమ్స్ అండ్ స్టైల్ ట్రైలర్ లో హైలైట్ గా నిలిచాయి. అయితే ఈ సినిమా విడుదలకు తెలుగునాట ఎలాగైతే భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయో కేరళలో కూడా అలాగే జరుగుతున్నాయి. మొదటిరోజు 30కి పైగా స్పెషల్ షోలను ఏర్పాటు చేయడంతో పాటు భారీ కటౌట్లు, బ్యానర్లు రెడీ చేస్తున్నారు అక్కడి లోకల్ ఫ్యాన్స్. మొత్తానికి ఇప్పటి వరకు కేరళలో ఏ తెలుగు హీరో సినిమాకి దొరకనంత గ్రాండ్ రిలీజ్ బన్నీ సినిమాకు లభిస్తోంది. పైగా మలయాళ నటులు జయరామ్, గోవింద్ పద్మసూర్యలు చిత్రంలో కీలక పాత్రల్లో నటించడంతో సినిమాపై అక్కడి ప్రేక్షకుల్లో ఆసక్తి మరింత పెరిగింది.

Latest News
 
వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ తేదీ ఖరారు చేసిన 'చంద్రముఖి 2' Thu, Apr 25, 2024, 09:26 PM
సాలిడ్ టిఆర్పీని నమోదు చేసిన 'లియో' Thu, Apr 25, 2024, 09:23 PM
అనుపమ తదుపరి టైటిల్ మరియు కాన్సెప్ట్ వీడియోని లాంచ్ చేయనున్న సమంత, రాజ్ అండ్ DK Thu, Apr 25, 2024, 09:19 PM
'ఫ్యామిలీ స్టార్' నుండి దేఖో రే దేఖో వీడియో సాంగ్ అవుట్ Thu, Apr 25, 2024, 09:17 PM
షాకింగ్ టిఆర్పిని నమోద చేసిన 'ఆదికేశవ' Thu, Apr 25, 2024, 09:13 PM