ఎన్టీఆర్ కి ఫ్రెండ్ గా రాహుల్ రామకృష్ణ!

by సూర్య | Fri, Jan 10, 2020, 12:35 PM

రాజమౌళి డైరెక్షన్ లో ఎన్టీఆర్ –  రామ్ చరణ్ హీరోలుగా రాబోతున్న చిత్రం  ‘ఆర్ఆర్ఆర్’. ఈ  భారీ మల్టీస్టారర్ ‘ఆర్ఆర్ఆర్’ మూవీలో రాహుల్ రామకృష్ణ కీలక పాత్రలో కనిపించబోతున్నాడు. పైగా ఎన్టీఆర్ కి ఫ్రెండ్ రోల్ లో నటించబోతున్నాడు. త్వరలో ఆర్‌ఆర్‌ఆర్ షూటింగ్ లో కూడా జాయిన్ అవ్వబోతున్నట్లు తెలుస్తోంది. ఎన్టీఆర్ కి ఫ్రెండ్ అంటే.. మనోడికి మంచి క్యారెక్టరే. పైగా ఎక్కువ సీన్స్ లో కనిపిస్తాడట. ఇక ఈ చిత్రంలో ఎన్టీఆర్ కొమరం భీం పాత్రలో కనిపించబోతున్న సంగతి తెలిసిందే. ధృడంగా ఉండే కొమరం భీం రోల్ కోసం ఎన్టీఆర్ ఇప్పటికే లాయిడ్ స్టీవెన్స్‌ పర్యవేక్షణలో కఠినమైన కసరత్తులు కూడా చేశాడు. అన్నట్టు సినిమాలో ఎన్టీఆర్ పాత్రే కాస్త ఎక్కువ ఉంటుందట. ఇక ఇతర ముఖ్యమైన పాత్రల్లో అజయ్ దేవగన్, సముద్రఖని నటిస్తున్నారు. డీవీవీ ఎంటెర్టైన్మెంట్స్ పతాకం ఫై దానయ్య ఈ సినిమాని నిర్మిస్తున్నారు. జులై 30, 2020 లో రిలీజ్ కాబోతున్న ఈ సినిమానికి కీరవాణి సంగీతం అందిస్తున్నారు. 

Latest News
 
'తలైవర్ 171' టైటిల్ టీజర్ విడుదలకి తేదీ ఖరారు Fri, Apr 19, 2024, 04:49 PM
OTT పార్టనర్ ని లాక్ చేసిన 'బడే మియాన్ చోటే మియాన్' Fri, Apr 19, 2024, 04:46 PM
డిజిటల్ స్ట్రీమింగ్ కి అందుబాటులోకి వచ్చిన '777 చార్లీ' హిందీ వెర్షన్ Fri, Apr 19, 2024, 04:22 PM
'లవ్ మౌళి' ట్రైలర్ రిలీజ్ Fri, Apr 19, 2024, 04:20 PM
భారీ మొత్తానికి అమ్ముడయిన 'గేమ్ ఛేంజర్' నార్త్ అమెరికా రైట్స్ Fri, Apr 19, 2024, 04:18 PM