చెన్నైలో రజినీ 'దర్బార్' ఓపెనింగ్ డే కలెక్షన్స్

by సూర్య | Fri, Jan 10, 2020, 12:11 PM

ఏఆర్‌ మురుగదాస్‌ దర్శకత్వం రజినీకాంత్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం దర్బార్. దర్శకుడు మురుగదాస్ తెరకెక్కిస్తున్న దర్బార్ మూవీలో రజిని పోలీస్ అధికారి పాత్ర చేస్తున్నారు. ముంబై నేపథ్యంలో నడిచే మాఫియా యాక్షన్ ఎంటర్టైనర్ అని తెలుస్తుంది. నయనతార హీరోయిన్ గా నటిస్తుంది. సూపర్ స్టార్ రజని యాక్షన్ ఎంటర్టైనర్ దర్బార్ నిన్న విడుదలైంది. అన్ని చోట్లా మంచి ఓపెనింగ్స్ అందుకున్న ఈ చిత్రం చెన్నై సిటీలో రికార్డ్ స్థాయి వసూళ్లు రాబట్టుకుంది. ట్రెడ్ వర్గాల సమాచారం మేరకు చెన్నై సిటీలో నిన్న రూ.2.27 కోట్ల గ్రాస్ వసూలు చేసింది ఈ సినిమా. పైగా నిన్న సెలవు రోజు కూడా కాదు. వర్కింగ్ డే రోజునే వసూళ్లు ఇలా ఉంటే అదే సెలవు రోజునో లేకపోతే వీకెండ్ రోజునో రిలీజ్ అయితే ఇంకా భారీ సంఖ్యలు నమోదయ్యేవని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఓపెనింగ్స్ పరంగా ఈ చిత్రం ఆల్ టైమ్ నెంబర్ 3 స్థానంలో నిలబడగా మొదటి స్థానంలో రజనీ యొక్క ‘2 పాయింట్ 0’, రెండో స్థానంలో విజయ్ నటించిన ‘సర్కార్’ ఉన్నాయి. ఇక ఈ వారంతంలో భారీ సినిమాలేవీ లేవు కాబట్టి వసూళ్లు స్టడీగానే కొనసాగనున్నాయి. మురుగదాస్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్ సంస్థ నిర్మించింది.

Latest News
 
'తలైవర్ 171' టైటిల్ టీజర్ విడుదల ఎప్పుడంటే...! Thu, Mar 28, 2024, 08:24 PM
'గేమ్ ఛేంజర్' డిజిటల్ రైట్స్ ని సొంతం చేసుకున్న ప్రముఖ ప్లాట్ఫారం Thu, Mar 28, 2024, 08:21 PM
'శ్రీరంగనీతులు' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కి వెన్యూ లాక్ Thu, Mar 28, 2024, 08:19 PM
'శశివదనే' నుండి గోదారి అటువైపో సాంగ్ రిలీజ్ Thu, Mar 28, 2024, 08:17 PM
త్వరలో స్మాల్ స్క్రీన్ పై ఎంట్రీ ఇవ్వనున్న 'అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్' Thu, Mar 28, 2024, 08:15 PM