ట్రెండింగ్‌లో ‘ఎంత మంచివాడవురా' ట్రైలర్ !

by సూర్య | Thu, Jan 09, 2020, 08:04 PM

సతీశ్ వేగేశ్న దర్శకత్వంలో నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా రూపొందిన చిత్రం ‘ఎంత మంచివాడవురా’. ఈ చిత్రాన్ని జనవరి 15న విడుదల చేయాలని చాన్నాళ్ల క్రితమే భావించిన నిర్మాతలు పెద్ద సినిమాల పోటీ ఉన్నా వెనక్కి తగ్గకుండా అదే రోజున చిత్రాన్ని విడుదల చేయనున్నారు. కాగా తాజాగా ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్ రిలీజ్ అయింది. తాజాగా విడుదలైన ఈ సినిమా ట్రైలర్‌ ఆన్‌లైన్‌లో హల్‌చల్‌ చేస్తోంది. ఈ సినిమా ట్రైలర్‌ నెటిజన్లను విశేషంగా ఆకట్టుకుంటోంది. ప్రస్తుతంగా ఈ సినిమా ట్రైలర్‌ యూట్యూబ్‌ ట్రెండింగ్‌లో నెంబర్‌ వన్‌ స్థానంలో ఉందని.. చిత్రయూనిట్‌ ఓ పోస్టర్‌ విడుదల చేసింది. బుధవారం రాత్రి విడుదలైన ఎంత మంచివాడవురా!. ట్రైలర్‌కు ఇప్పటివరకు 19లక్షలకుపైగా వ్యూస్‌ రెండు మిలియన్స్‌ దిశగా దూసుకుపోతోంది. కళ్యాణ్‌రామ్‌ సరసన మెహరీన్‌ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాను శ్రీదేవీ మూవీస్‌ పతాకంపై శివలెంక కృష్ణప్రసాద్‌ సమర్పణంలో ఉమేష్‌ గుప్త, సుభాష్‌ గుప్తలు నిర్మిస్తున్నారు. 

Latest News
 
కన్నడ నటి హర్షిక పూనాచా, ఆమె భర్త పై దుండగులు దాడి Sat, Apr 20, 2024, 10:39 AM
'మంజుమ్మెల్ బాయ్స్' OTT రిలీజ్ డేట్ ఫిక్స్ Sat, Apr 20, 2024, 10:36 AM
'ప్రేమలు' సినిమాకి సీక్వెల్ రెడీ Fri, Apr 19, 2024, 11:34 PM
మెగాస్టార్​ చిరంజీవితో రష్యా ప్రతినిధుల సమావేశం Fri, Apr 19, 2024, 08:54 PM
100M స్ట్రీమింగ్ నిమిషాలను క్రాస్ చేసిన 'గామి' Fri, Apr 19, 2024, 08:23 PM