ఆ రెండు రాష్ట్రాలో 'ఛపాక్ సినిమాకు పన్ను రద్దు!

by సూర్య | Thu, Jan 09, 2020, 07:32 PM

‘ఛపాక్’ సినిమా రేపు దేశవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సందర్భంగా సినిమాపై వినోద పన్నును రద్దు చేస్తున్నట్టు మధ్యప్రదేశ్, చత్తీస్‌గడ్ రాష్ట్రాలు ప్రకటించాయి. ఈ సినిమా మేఘనా గుల్జార్ దర్శకత్వంలో దీపిక పడుకొణె యాసిడ్ బాధితురాలు లక్ష్మీ అగర్వాల్ పాత్రలో నటించారు. అయితే దీపికా పాత్రకు స్ఫూర్తి అయిన లక్ష్మీ అగర్వాల్ కు న్యాయవాదిగా వ్యవహరించిన లాయర్ అపర్ణా భట్ కోర్టుకి ఎక్కారు. అనేక ఏళ్ళు లక్ష్మీ తరుపున న్యాయ పోరాటం చేసిన నాకు సినిమా టైటిల్స్ లో క్రెడిట్ ఇవ్వడకపోవడం దారుణం అని ఆ లాయర్ ఢిల్లీ కోర్ట్ ని ఆశ్రయించారు. లాయర్ అపర్ణాభట్ ఈ విషయాలను ఫేస్‌బుక్‌లో వివరించారు. అలాగే ఈ సినిమా ప్రదర్శన ఆపివేయాలంటూ ఢిల్లీలోని పాటియాలా కోర్టుకు అభ్యర్థించానని తెలిపారు. విడుదలకు ముందు రోజు ఇలాంటి వివాదాలు సినిమా నిర్మాతలకు తలనొప్పిగా మారుతున్నాయి. లేడీ డైరెక్టర్ మేఘనా గుల్జార్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించగా హీరోయిన్ దీపికా పదుకొనే స్వయంగా నిర్మించారు. ఈ చిత్ర ప్రమోషన్స్ చాలా గట్టిగా నిర్వహించారు దీపికా పదుకొనె. తన పుట్టినరోజు యాసిడ్ అట్టాక్ బాధితులతో జరుపుకున్న ఆమె, ఆ మేకప్ తో ముంబై నగరంలో పబ్లిక్ ప్రదేశాలలో సంచరించారు. ఇప్పటికే ఈ చిత్ర ప్రీమియర్ షో ల ప్రదర్శన జరుగగా పాజిటివ్ టాక్ వస్తుంది.

Latest News
 
కొత్త విడుదల తేదీని లాక్ చేసిన 'లవ్ మి - ఇఫ్ యు డేర్' Wed, Apr 24, 2024, 07:54 PM
15M+ వ్యూస్ ని సొంతం చేసుకున్న 'మిరాయి' టైటిల్ టీజర్ Wed, Apr 24, 2024, 07:52 PM
మరో రెండు రోజులలో 'టిల్లు స్క్వేర్' OTT ఎంట్రీ Wed, Apr 24, 2024, 06:21 PM
'థగ్ లైఫ్‌' సెట్స్ లో జాయిన్ అయ్యిన త్రిష Wed, Apr 24, 2024, 06:19 PM
3M+ వ్యూస్ ని సొంతం చేసుకున్న 'ఆ ఒక్కటి అడక్కు' ట్రైలర్ Wed, Apr 24, 2024, 06:17 PM