నైజాంలో ‘సైరా’ కలెక్షన్స్ ...!

by సూర్య | Tue, Oct 15, 2019, 12:16 PM

భారీ అంచనాల నడుమ అక్టోబర్ 2న విడుదలైన ‘సైరా’ చిత్రం బాక్సాఫీస్ వద్ద మొదటి రోజు అనుకున్నట్టే వసూళ్ల ప్రభంజనం సృష్టించింది. ముఖ్యంగా నైజాం బాక్స్ ఆఫీస్ ముందు మెగాస్టార్ క్రేజ్ ఏపాటిదో మొదటిరోజు వచ్చిన కలెక్షన్స్ తో ఋజువైంది. కాగా నిన్న నైజాంలో ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద 40 లక్షల కలెక్షన్స్ ను సాధించింది. అలాగే నైజాం మొదటిరోజు కలెక్షన్స్ అల్ టైమ్ రికార్డ్ క్రియేట్ చేసిన సినిమాల జాబితాలో ‘సైరా’ మూడో స్థానంలో నిలిచిన విషయం తెలిసిందే. కాగా బాలీవుడ్ లెజెండ్ అమితాబ్ బచ్చన్ మెగాస్టార్ చిరంజీవి కోసం సైరా చిత్రంలో నరసింహారెడ్డి గురువు గోసాయి వెంకన్నగా కనిపించారు. అలాగే ఈ సినిమాలో సుదీప్, విజయ్ సేతుపతి, జగపతిబాబు, అనుష్క వంటి స్టార్ లు కూడా నటించారు. అందుకే సైరా కోసం తెలుగు ప్రేక్షకులే కాకుండా.. హిందీ, కన్నడ మరియు తమిళ ప్రేక్షకులు కూడా సినిమాని ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు. ఈ చిత్రంలో నయనతార కథానాయికగా నటించింది.

Latest News
 
హనుమాన్ ఈవెంట్‌లో ప్రశాంత్ వర్మ కీలక వ్యాఖ్యలు Wed, Apr 24, 2024, 05:07 PM
త్వరలో విడుదల కానున్న 'బేబీ జాన్' టీజర్ Wed, Apr 24, 2024, 05:06 PM
ఈ వారం విడుదల కానున్న OTT సినిమాలు మరియు సిరీస్ Wed, Apr 24, 2024, 05:04 PM
'గుడ్ బ్యాడ్ అగ్లీ' షూటింగ్ ప్రారంభం అప్పుడేనా? Wed, Apr 24, 2024, 04:38 PM
కొత్త చిత్రాన్ని ప్రకటించిన రాఘవ లారెన్స్ Wed, Apr 24, 2024, 04:36 PM