‘ఏడు చేపల కథ’ ట్రైలర్‌ రిలీజ్...

by సూర్య | Mon, Oct 14, 2019, 05:45 PM

అభిషేక్ పచ్చిపాల, భాను శ్రీ హీరో హీరోయిన్లుగా నటించిన ‘ఏడు చేపల కథ’ చిత్ర ట్రైలర్‌ను వదిలింది చిత్ర యూనిట్. ఏడుగురు హీరోయిన్లని ఏడు చేపలుగా చూపిస్తూ కట్ చేసిన ట్రైలర్ అశ్లీలత, అసభ్యకరమైన సంభాషనలతో పోర్న్ సినిమాకు ఏమాత్రం తీసిపోకుండా ఉంది. ఆడవాళ్లెవరైనా ఎక్స్ పోజింగ్ చేస్తే చూసి నిగ్రహించుకునే శక్తి లేదు సార్ .. టెంప్ట్ అయిపోతాను’.. తిరిగి వాళ్ళెందుకు టెంప్ట్ అవుతున్నారో తెలియడం లేదు సార్’.. అంటూ తనకు చిక్కిన ‘ఏడు చేపల కథా’ కార్యక్రమాలను పూసగుచ్చినట్టు చెప్పి 20 మిలియన్లకు పైగా వ్యూస్‌తో టెంప్ట్ చేసిన టెంప్ట్ రవి మళ్లీ ట్రైలర్‌‌తో ఆ మూవీని చూపిస్తున్నాడు. బిగ్ బాస్ ఫేమ్ భాను శ్రీ లీడ్ రోల్‌లో అభిషేక్ రెడ్డి, ఆయేషా సింగ్, నగరం సునీల్ తదితరులు నటిస్తున్న ఈ చిత్ర ట్రైలర్‌ విడుదలైంది. పక్కా బూతు కంటెంట్‌తో మూడు నిమిషాల నిడివితో చిన్న సైజు సెక్స్ సినిమాను చూపించేశారు ట్రైలర్‌లో. ఈ కళాఖండానికి ఎస్ జె చైతన్య దర్శకత్వం వహించగా.. చరిత సినిమా ఆర్ట్స్ పతాకంపై డా.రాకేష్ రెడ్డి గూడూరు సమర్పణలో శేఖర్ రెడ్డి, జివిఎన్ నిర్మించారు. పూర్తి అడల్డ్ కామెడీ జోనర్‌లో కొత్త వారితో రూపొందించిన ఫస్ట్ లుక్‌, టీజర్స్ బిజినెస్ స‌ర్కిల్‌లో హ్యూజ్ బ‌జ్ రావ‌టంతో పోర్న్ సినిమాకు ఏమాత్రం తీసిపోకుండా తాజా ట్రైలర్‌ను కట్ చేశారు. అశ్లీలత, అసభ్యకరమైన సంభాషణలు ఇందులో చాలా ఉన్నాయ్.. కంప్లీట్ అడల్ట్ కంటెంట్‌తో పచ్చి బూతులు, అశ్లీల దృశ్యాలతో బూతు సినిమాలకు బాస్‌లా ఉన్న ‘ఏడు చేపల కథ’ ట్రైలర్ కామప్రియులకు విపరీతంగా నచ్చేయడంతో యూట్యూబ్‌ని షేక్ చేస్తుంది. ఈ అడల్ట్ కామెడీ ట్రైలర్‌ను బాయ్ ఫ్రెండ్‌తోనో.. గర్ల్ ఫ్రెండ్‌తోనో కలిసి మాత్రమే చూడాలని కండిషన్ పెడుతోంది చిత్ర యూనిట్. ఇక ఈ ట్రైలర్‌లో భాను శ్రీ సైతం.. ‘సుందర్ నీకొక కథ చెప్తా.. ఏడు చేపల కథ.. చిన్న పిల్లలకు చెప్తారే ఆ కథ కాదు’ అంటూ ఈ బూతు సినిమాను చూపిస్తుంది. ఇందులో హీరో నెలకోసారి బ్లడ్ ఎక్కించుకోకపోతే చనిపోతాడు ఆ బ్లడ్ కోసం ఏడు చేపల్లాంటి అందగత్తెలతో కామకేళిలో తేలియాడుతున్నాడు.

Latest News
 
సూర్య కొత్త సినిమాపై అప్‌డేట్ Fri, Mar 29, 2024, 02:24 PM
లాంగ్ బ్లాక్ గౌన్ లో బుట్టబొమ్మలా రష్మీ Fri, Mar 29, 2024, 01:44 PM
మూవీ రివ్యూ: “టిల్లు స్క్వేర్” Fri, Mar 29, 2024, 12:45 PM
నేడు విడుదలకి సిద్ధమైన ‘గాడ్జిల్లా అండ్‌ కాంగ్‌’ Fri, Mar 29, 2024, 12:03 PM
ఏప్రిల్ 22న టైటిల్ చెబుతాం Fri, Mar 29, 2024, 12:01 PM