అమెజాన్, నెట్ ఫ్లిక్స్‌లో ‘అల వైకుంఠపురములో’ చూడలేరు

by సూర్య | Mon, Oct 14, 2019, 04:11 PM

ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్ వచ్చాక సినిమాల పరిస్థితి దారుణంగా తయారైంది. డిజిటల్ పార్ట్నర్స్ పేరుతో అమెజాన్, నెట్ ఫ్లిక్స్ లాంటి సంస్థలు సినిమా థియేటర్లలో ఉండగానే విడుదల చేసేస్తున్నాయి. దీంతో థియేటర్లలోనే సినిమా చూడాలనే ఆలోచన ప్రేక్షకుల్లో సన్నగిల్లుతోంది. విడుదలకు ముందే పలానా సంస్థ డిజిటల్ రైట్స్ కొనుగోలు చేసిందని తెలిసిపోతుండటంతో ఇంకో నెల ఆగితే ఇంట్లోనే చూసేయవచ్చనే ఆభిప్రాయానికి వచ్చేస్తూ థియేటర్ల వైపు చూడట్లేదు. రిపీటెడ్ ఆడియన్స్ సైతం తగ్గిపోయారు.  ముఖ్యంగా ఓవర్సీస్ మార్కెట్ బాగా ఎఫెక్ట్ అవుతోంది. దీంతో ‘అల వైకుంఠపురములో’ యూఎస్ డిస్ట్రిబ్యూషన్ సంస్థ బ్లూ స్కై సినిమాస్ ఈ చిత్రాన్ని అమెజాన్, నెట్ ఫ్లిక్స్ ద్వారా చూడలేరు అంటూ పోస్టర్ ద్వారా తెలిపింది. అంటే చిత్రం ఫుల్ రన్ పూర్తయ్యేవరకు డిజిటల్ స్ట్రీమింగ్ ఉండదని వారి సూచన. దీని వలన థియేటర్లకు వచ్చే ప్రేక్షకుల ప్రేక్షకుల సంఖ్య పెరిగే ఛాన్సుంది. మొత్తానికి ‘అల వైకుంఠపురములో’ డిస్ట్రిబ్యూటర్స్ మంచి నిర్ణయమే తీసుకున్నారు. ఇతర సినిమాల మేకర్స్ సైతం ఇకపై కనీసం సుమారు రెండు నెలల వరకు డిజిటల్ స్ట్రీమింగ్ ఉండకూడదనే నిబంధనను పెట్టుకుని డిజిటల్ స్ట్రీమింగ్ సంస్థలతో ఒప్పందాలు చేసుకుంటే మంచిది.

Latest News
 
కొత్త విడుదల తేదీని లాక్ చేసిన 'లవ్ మి - ఇఫ్ యు డేర్' Wed, Apr 24, 2024, 07:54 PM
15M+ వ్యూస్ ని సొంతం చేసుకున్న 'మిరాయి' టైటిల్ టీజర్ Wed, Apr 24, 2024, 07:52 PM
మరో రెండు రోజులలో 'టిల్లు స్క్వేర్' OTT ఎంట్రీ Wed, Apr 24, 2024, 06:21 PM
'థగ్ లైఫ్‌' సెట్స్ లో జాయిన్ అయ్యిన త్రిష Wed, Apr 24, 2024, 06:19 PM
3M+ వ్యూస్ ని సొంతం చేసుకున్న 'ఆ ఒక్కటి అడక్కు' ట్రైలర్ Wed, Apr 24, 2024, 06:17 PM