కార్తీ ‘ఖైదీ’ ట్రైలర్ కొత్తగా ఉంది...

by సూర్య | Mon, Oct 14, 2019, 03:56 PM

హీరో కార్తీ చేస్తున్న ప్రయోగాత్మక చిత్రం ఖైదీ. సందీప్ కిషన్ హీరోగా వచ్చిన బైలింగ్వల్ మూవీ నగరం చిత్రానికి దర్శకుడైన లోకేష్ కనగరాజ్ ఈ మూవీకి దర్శకత్వం వహించారు. చిత్రం మొత్తం రాత్రి నేపథ్యంలో నడవడం ఈ మూవీ విశేషత. ఒక్క షాట్ కూడా డే లైట్ లో ఉండదట. అలాగే కథ అంతా ఒక రాత్రి లోనే నడుస్తుంది. కాగా నేడు ఈ మూవీ తెలుగు ట్రైలర్ విడుదల చేయడం జరిగింది. సస్పెన్సు అండ్ యాక్షన్ తో సాగిన ఖైదీ ట్రైలర్ అద్భుతంగా ఉంది. యావజ్జీవ శిక్ష పడిన పరారీ ఖైదీగా కార్తీ కనిపిస్తున్నాడు. ఓ మాఫియా గ్యాంగ్ మరియు పోలీస్ లు అతన్ని వెతుకుతూ ఉంటారు. ఇదే ప్రధాన కధాంశంగా ఖైదీ చిత్రం తెరకెక్కింది. పాటలు, హీరోయిన్ , కామెడీ వంటి కమర్షియల్ అంశాలేమి లేకుండా సాగే కాన్సెప్ట్ బేస్డ్ మూవీగా తెరకెక్కింది. ఈ చిత్రాన్ని దీపావళి కానుకగా విడుదల చేయనున్నారు.

Latest News
 
డిజిటల్ స్ట్రీమింగ్ కి అందుబాటులో 'చారి 111' Thu, Apr 25, 2024, 03:42 PM
'అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్' స్మాల్ స్క్రీన్ ఎంట్రీకి తేదీ లాక్ Thu, Apr 25, 2024, 03:27 PM
'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' టీజర్ లాంచ్ ఈవెంట్ కి వెన్యూ లాక్ Thu, Apr 25, 2024, 03:25 PM
'పుష్ప 2' ఫస్ట్ సింగల్ విడుదల ఎప్పుడంటే...! Thu, Apr 25, 2024, 03:21 PM
'డబుల్ ఇస్మార్ట్' ఫస్ట్ సింగల్ రిలీజ్ అప్పుడేనా? Thu, Apr 25, 2024, 03:18 PM