బ్యాడ్ బాయ్ గా విక్టరీ వెంకటేష్‌....!

by సూర్య | Mon, Oct 14, 2019, 02:48 PM

వెంకటేష్ అంటేనే గుడ్ బాయ్ ఇమేజ్ ఉంది. 34 ఏళ్లుగా ఇదే ఇమేజ్ మెయింటేన్ చేస్తున్నాడు ఈ సీనియర్ హీరో. వెంకటేష్ నిజంగానే మాస్ పాత్ర చేసినా కూడా అందులోనూ ఫ్యామిలీ ఎమోషన్స్ వెతుక్కుంటారు ఆడియన్స్. ఇప్పటి వరకు బ్యాడ్ బాయ్ పాత్రలు పెద్దగా చేసింది లేదు ఈ హీరో. కానీ ఇప్పుడు తొలిసారి పూర్తిస్థాయి బ్యాడ్ బాయ్‌గా కనిపించబోతున్నాడు వెంకీ. ప్రస్తుతం ఈయన వెంకీ మామ సినిమాలో నటిస్తున్నాడు. బాబీ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో నాగ చైతన్య మరో హీరోగా నటిస్తున్నాడు. ఈ చిత్రం తర్వాత తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో సినిమా చేయబోతున్నాడు ఈయన. దీనికోసం తనను తాను మార్చుకోబోతున్నాడు వెంకీ. ఈ చిత్రాన్ని గుర్రపు స్వారీల నేపథ్యంలో తెరకెక్కించబోతున్నాడు తరుణ్. ఇందులో రేస్‌లు అంటే పిచ్చి ఉన్న పాత్రలో కనిపించనున్నాడు వెంకటేష్. రేసింగ్ కోసం ఏదైనా చేసే కారెక్టర్ ఇది. ప్రస్తుతం గుర్రపు స్వారీ కోసం రేసింగ్ క్లబ్‌లో శిక్షణ తీసుకుంటున్నాడు వెంకటేష్. మలక్‌పేట్ రేస్ క్లబ్‌లో దీనికి సంబంధించిన సీన్స్ కూడా చిత్రీకరించబోతున్నారని తెలుస్తుంది. పెళ్లి చూపులు సినిమాతో బ్లాక్ బస్టర్ కొట్టిన తరుణ్ భాస్కర్.. ఈ నగరానికి ఏమైంది సినిమాతో ఆకట్టుకోలేకపోయాడు. ఆ తర్వాత నటుడిగా బిజీ అయిన తరుణ్.. ఇప్పుడు మళ్లీ మెగాఫోన్ పడుతున్నాడు. వెంకీ కోసం పూర్తిగా భిన్నమైన కథ సిద్ధం చేసాడు. మొత్తానికి చాలా రోజుల తర్వాత వెంకీ కూడా కాస్త కొత్త తరహా పాత్రలో కనిపించబోతున్నాడు. మరి ఇది ఎలా ఉండబోతుందో చూడాలిక. 

Latest News
 
'తలైవర్ 171' టైటిల్ టీజర్ విడుదల ఎప్పుడంటే...! Thu, Mar 28, 2024, 08:24 PM
'గేమ్ ఛేంజర్' డిజిటల్ రైట్స్ ని సొంతం చేసుకున్న ప్రముఖ ప్లాట్ఫారం Thu, Mar 28, 2024, 08:21 PM
'శ్రీరంగనీతులు' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కి వెన్యూ లాక్ Thu, Mar 28, 2024, 08:19 PM
'శశివదనే' నుండి గోదారి అటువైపో సాంగ్ రిలీజ్ Thu, Mar 28, 2024, 08:17 PM
త్వరలో స్మాల్ స్క్రీన్ పై ఎంట్రీ ఇవ్వనున్న 'అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్' Thu, Mar 28, 2024, 08:15 PM